బచ్చన్నపేట ఏప్రిల్ 14. రైతులు పండించిన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాల్లోనే అమ్మాలని చేర్యాల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నల్లనాగుల శ్వేత అన్నారు. సోమవారం మండలంలోని సాల్వాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా శ్వేత మాట్లాడుతూ రైతులకు గిట్టుబాటు ధర కల్పించేందుకే గ్రామాల్లో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా కొనుగోలు కేంద్రాలకే తీసుకొచ్చి ధాన్యం విక్రయించాలన్నారు.
కేంద్రాల్లో సకల వసతులు ఏర్పాటు చేశామన్నారు. రైతులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకోవాలని సిబ్బందిని ఆదేశించారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో గ్రామ కాంగ్రెస్ నాయకులు మాజీ సర్పంచ్ బండ కింది హరిబాబు గౌడ్, పార్టీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి పిన్నింటి కావ్య శ్రీరెడ్డి, మాజీ ఎంపిటిసి గూడెపులతా శ్రీ తిరుపతి గౌడ్, వెంకట్ గౌడ్, రమేష్ గౌడ్, మహిళా సంఘాల ప్రతినిధులు పద్మ, నవనీత, సోనీ, ధనలక్ష్మి, సీసీ నరసింహులు, వీఓఏ రేణుక, గ్రామ రైతులు పాల్గొన్నారు.