గిర్మాజీపేట, డిసెంబర్ 29 : గ్రేటర్ వరంగల్ కార్పొరేషన్ ఎన్నికల్లో 12వ డివిజన్లో బీజేపీ తరుపున కార్పొరేటర్‌గా పోటీచేసిన నాగనబోయిన రాంకీ, బీజేపీ డివిజన్ యూత్ ప్రెసిడెంట్ సంగనబోయిన రాకేశ్ బీఆర్ఎస్లో చేరారు. గురువారం క్యాంప్ కార్యాయంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ వారికి గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో ప్రజా సంక్షేమమే ప్రధాన ఎజెండాగా పాలన కొనసాగుతున్నదని, అభివృద్ధిని చూసే ప్రతిపక్ష నాయకులు పార్టీలోకి వస్తున్నారని చెప్పారు. మతతత్వ బీజేపీకి వచ్చే ఎన్నికల్లో ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమన్నారు. రాంకీ మాట్లాడుతూ.. తూర్పు నియోజకవర్గంలో బీజేపీ బీసీలకు ప్రాధాన్యం ఇవ్వడం లేదని, తెలంగాణపై కేంద్ర ప్రభుత్వ వ్యతిరేక వైఖరికి నిరసనగా బీఆర్ఎస్లో చేరానని, త్వరలో మరిన్ని చేరికలు ఉంటాయని తెలిపారు.
కార్యక్రమంలో 12వ డివిజన్ కార్పొరేటర్ కావటి కవిత, 13వ డివిజన్ కార్పొరేటర్ సురేశ్‌జోషి, జిల్లా నాయకులు మావురపు విజయ్‌భాస్కర్‌రెడ్డి, గోరంట్ల మనోహర్, వనపర్తి శ్రీనివాస్, ఇనుముల నాగరాజు, జన్ను వీరేశ్, డివిజన్ ముఖ్య నాయకులు పాల్గొన్నారు. అలాగే, 42వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడిగా ఎన్నికైన కర్ర కుమార్, కమిటీ సభ్యులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. అనంతరం ఎమ్మెల్యే మేదరి సంఘం వారి నూతన సంవత్సర క్యాలెండర్‌ను ఆవిష్కరించారు. కార్యక్రమంలో పీఏసీఎస్ చైర్మన్ కేడల జనార్దన్, మాజీ కార్పొరేటర్ కేడల పద్మ, పాలకుర్తి సుమన్, కత్తి ఎల్లగౌడ్, పాలకుర్తి శ్రీను, ఆవునూరి లక్ష్మి, అంబటి రమ, శంకేశి రాధిక, మచ్చ కవిత, చిట్ల రమ్య, యాకలక్ష్మి, వెంకన్న, వనం శ్రావణ్, బన్న ప్రభాకర్, అమరావతి, రమ తదితరులు పాల్గొన్నారు.
ఆటో కార్మికులకు అండగా ఉంటా..
వరంగల్ పోస్టాఫీస్ వద్ద ఏర్పాటు చేసిన తెలంగాణ ఆటో యూనియన్ అడ్డాను కార్పొరేటర్ గందె కల్పన సమక్షంలో ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కార్మికుల సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ పనిచేస్తున్నారన్నారు. ఆటో కార్మికుల ప్రతి కష్టంలోనూ అండగా ఉంటానని తెలిపారు. యూనియన్‌కు సంబంధించిన వాల్‌పోస్టర్లను ఆవిష్కరించి ఆటోలకు అంటించారు. అనంతర ఆటో నడిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్లు చింతాకుల అనిల్, సురేశ్‌జోషి, పస్కుల బాబు, బీఆర్ఎస్ నేతలు గందె నవీన్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రమేశ్‌బాబు, మాజీ కార్పొరేటర్ జారతి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం వరంగల్ చౌరస్తాలో మొబైల్స్ అసోసియేషన్ వారు ఏర్పాటు చేసిన సమావేశానికి హాజరయ్యారు. సమస్యలను పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు.