ములుగు : రేవంత్ రెడ్డి అవినీతి ( Revanth Reddy Corruption ) లో భాగస్వామ్య మున్నందునే కొండా సురేఖ బర్తరఫ్‌పై మంత్రి సీతక్క ( Minister Seetakka ) స్పందించలేదని మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ( Satyavati Rathod ) ఆరోపించారు. కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల విఫల పాలనను నిరసిస్తూ శనివారం ములుగు జిల్లా కేంద్రంలోని తెలంగాణ భవన్లో నిర్వహించిన విద్యార్థి యువజన సదస్సులో ఆమె పాల్గొని మాట్లాడారు.
కొండ సురేఖ ( Konda Surekha ) కు జరిగిన అన్యాయంపై మంత్రి సీతక్క ఎందుకు స్పందించలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. నిర్వహించగా మాజీ మంత్రి సత్యవతి రాథోడ్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. కాంగ్రెస్ ప్రభుత్వ పాలనలో మంత్రుల శాఖలలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోందన్నారు.
మేడారం, మహా జాతర అభివృద్ధి పనులతో మొదలైన మంత్రుల పంచాయతీ సురేఖ మంత్రి పదవి కోల్పోయే దాకా కొనసాగిందని విమర్శించారు.రేవంత్ రెడ్డి చేస్తున్న అవినీతిపై మంత్రి సురేఖ ప్రశ్నించినందుకే మంత్రి పదవి కోల్పోవలసి వచ్చిందని పేర్కొన్నారు.
వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన సాటి మహిళ సురేఖ రేవంత్ రెడ్డి అవినీతిపై ప్రశ్నించి మంత్రి పదవి కోల్పోయిన కూడా స్పందించకుండా రేవంత్ రెడ్డికి అండగా నిలవడంలో అవినీతిలో సీతక్కకు కూడా భాగం ఉందని అనుమానం వ్యక్తం చేశారు. యువత కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలను నిలదీయడంతో పాటు మోసాలను గ్రహించి తగిన బుద్ధి చెప్పాలన్నారు.