న్యూశాయంపేట, ఏప్రిల్ 7: నగరానికి చెందిన పర్యావరణ పరిరక్షకుడు ప్రకాష్ సోమవారం విత్తన సేకరణ మహోద్యమాన్ని చేపట్టారు. ఈ కార్యక్రమంలో భాగంగా రామకృష్ణ కాలనీలో గల జన శిక్షణ సంస్థాన్ లో శిక్షణ తీసుకుంటున్న అభ్యర్థి రాకేష్ తమ బంధువుల నుండి చింత విత్తనాలు సేకరించి జన శిక్షణ సంస్థ వరంగల్ డైరెక్టర్ ఎండీ ఖాజా మాసుద్దీన్ ఆధ్వర్యంలో ప్రకాష్‌కు దానం చేశారు. ఈ సందర్భంగా ప్రకాష్ మాట్లాడుతూ పట్టణీకరణ నేపథ్యంలో రోజురోజుకు అడవుల శాతం గణనీయంగా తగ్గిపోతుందన్నారు.
అడవుల శాతం పెంచడానికి విత్తనాలు సేకరించి రాబోయే వర్షాకాలంలో చల్లుతామని తెలిపారు. ప్రజలు విత్తనాలు( మామిడి, నేరేడు, కానుగా, వేప, చింత, పనస) మొదలైనవి దానం చేయాలనుకుంటే 8801161895 నెంబర్ కి ఫోన్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో తిరుపతి, యుగంధర్ పాల్గొన్నారు.