హనుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 3 : స్థానిక సంస్థల ఎన్నికల్లో గ్రామాలకు వచ్చే కాంగ్రెస్ నాయకులను మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఎక్కడా అని నిలదీయాలని స్వేరో స్టూడెంట్స్‌యూనియన్ హనుమకొండ జిల్లా అధ్యక్షులు వెల్తూరి సాయికుమార్ పిలుపునిచ్చారు. బుధవారం కాకతీయ యూనివర్సిటీ గెస్ట్‌హస్‌లో ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న సమయంలో విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు అందరూ పల్లెబాటపట్టి కాంగ్రెస్ పార్టీ మెనిఫెస్టోలో పెట్టిన హామీలను నెరవేర్చాలని కాంగ్రెస్ పార్టీ నాయకులను నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.
స్కాలర్షిప్స్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయకపోవడంతో విద్యార్థులంతా ఏకమై వారిని ఎలక్షన్లో బొందపెట్టాలని, ఏరికోరి తెచ్చుకున్న కాంగ్రెస్ ప్రభుత్వం విద్యార్థులను మోసం చేసి, నమ్మించి గొంతు కోసిందన్నారు. కాంగ్రెస్ నిరుద్యోగులందరూ ఓటువేసి గద్దనెక్కించుకుంటే జాబ్ క్యాలెండర్ వేయకుండా దివాలా తీస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసి నిరుద్యోగులకు అండగా నిలవాలని స్థానిక సంస్థల్లో ప్రతి ఒక్క నిరుద్యోగి నిలదీయాల్సిన అవసరం ఉందన్నారు.
కాంగ్రెస్ మేనిఫెస్టోలో కాంగ్రెస్ అధినేత రాహుల్‌గాంధీతో స్కూటీలు ఇస్తామని చెప్పి ఇంతవరకు స్కూటీల ఊసే లేకుండా ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తుందని, రాష్ర్టంలో ఒక్క మహి కన్నా స్కూటీ ఇచ్చిందా అని ప్రశ్నించారు. కార్యక్రమంలో స్వేరో స్టూడెంట్స్‌యూనియన్ నాయకులు ప్రతాప్, అజయ్, వెంకటేష్, దరి, శ్రీకాంత్, మహదేవ్, టికాజి, రాజు, గణేష్, శివ, శ్రావణ్ పాల్గొన్నారు.