సుబేదారి, జనవరి 6: ట్రాఫిక్ పెండింగ్ చలాన్ల చెల్లింపునకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన డిస్కాంట్ను వాహనదారులు వినియోగించుకుంటున్నారు. బైక్లు, ఆటోలకు 80 శాతం, కార్లు, ఇతర హెవీ మోటర్ వెహికిల్స్, ట్రక్కులకు ప్రభుత్వం 60 శాతం రాయితీ ఇచ్చింది. ఈ నెల 10వ తేదీ వరకు గడువు విధించింది. ఈ అవకాశాన్ని పెండింగ్ చలాన్లు ఉన్న వాహనదారులు సద్వినియోగం చేసుకుంటున్నారు. గ్రేటర్లోని వరంగల్, హనుమకొండ, కాజీపేట ట్రాఫిక్ పోలీస్స్టేషన్ల పరిధిలో 2019 జనవరి నుంచి 2023 డిసెంబర్ వరకు 23 లక్షల చలాన్లు నమోదయ్యాయి. ఈ క్రమంలో ప్రభుత్వం డిస్కాంట్ ఇవ్వడంతో డిసెంబర్ 27 నుంచి ఈ నెల 6వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ట్రైసిటీలో 4,75,816 చలాన్లకు సంబంధించిన వాహనదారులు ఆన్లైన్ ద్వారా రూ. 13,36,26,620 చెల్లించినట్లు వరంగల్ ట్రాఫిక్ ఏసీపీ బోజరాజు తెలిపారు. ఇదిలా ఉంటే.. చలాన్ల చెల్లింపుల్లో హనుమకొండ, వరంగల్ జిల్లాల ఉన్నతాధికారుల వాహనాలు ఉన్నాయి.