కాజీపేట/చిల్పూరు, జూన్ 6 : నాగర్సోల్ నుంచి నర్సాపూర్ వెళ్తున్న నాగర్సోల్ ఎక్స్‌ప్రెస్ రైలులో బుధ వారం అర్ధరాత్రి దాటిన తర్వాత దొంగలు దోపిడీకి పాల్పడ్డారు. జనగామ జిల్లా నష్కల్-పెండ్యాల్ రైల్వే స్టేషన్ల మధ్య రైలును ఆపి ఐదు బోగీల్లోని ప్రయాణికులకు చెందిన దాదాపు 24 తులాల బంగారం, బ్యాగులు, సెల్ఫోన్లను అపహరించుకుపోయారు. రైల్వే పోలీసులు, ప్రత్యక్ష సాక్షులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి నాగర్సోల్ రైలు బుధవారం రాత్రి 11.50 గంటలకు బయలుదేరింది. నష్కల్-పెండ్యాల్ రైల్వేస్టేషన్ల మధ్య సాంకేతిక పనులు జరుగుతున్న నేపథ్యంలో రైలు 15-20 కిలోమీటర్ల స్పీడ్‌గా మాత్రమే నడుస్తోంది. ఈ క్రమంలో దీంతో దొంగలు గురువారం తెల్లవారుజామున 1.10 గంటలకు ఎయిర్ వాల్వ్ విప్పడంతో రైలు నిలిచిపోయింది. దీంతో కొందరు ఎస్ 2, ఎస్4, ఎస్ 5, ఎస్ 6, ఎస్ 11 బోగీల్లో ప్రవేశించి ప్రయాణికుల బ్యాగులు, సెల్ఫోన్లు, మరికొందరు బోగీ కిటికీల వద్ద ఒకరిపై ఒకరు ఎక్కి నిద్రలో ఉన్న వారి మెడల్లోని బంగారం వస్తువులను కత్తిరించి దొంగతనానికి పాల్పడ్డారు. వెంటనే మేల్కొన్న ప్రయాణికులు అరవడంతో కొంత మంది బంగారం వస్తువులను వదలిపెట్టి వెళ్లా రు. 17 నిమిషాల తర్వాత రైలు కాజీపేట రైల్వే జంక్షన్‌కు చేరుకోగానే ప్రయాణికులు పోలీసుల దృష్టికి విషయాన్ని తీసువెళ్లా రు. ఘటనా స్థలాన్ని గురువారం రైల్వే డీఎస్పీ కృపాకర్, జీఆ ర్పీ సీఐ సురేశ్, ఆర్పీఎఫ్ ఏఎస్సీ సుభాష్, సీఐ సంజీవరావు, ఏసీపీ భీష్మ వర్మ సందర్శించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మోహినుద్దీన్ చెప్పారు. 12 గ్రాముల బంగా రం చైన్‌ను అపహరించుకుపోయారని విజయవాడకు చెందిన అన్నెపు సాయిరమేశ్-కవిత ఫిర్యాదు చేశారని, మిగతా బాధి తులు ఎవరైనా ఉంటే వారి ప్రాంతంలోని జీఆర్పీలో జీరో ఎఫ్ఐఆర్ నమోదు చేసి కాజీపేటకు బదిలీ చేస్తారని వివరించారు.