ఖిలావరంగల్: వన మహోత్సవంలో భాగంగా ప్రతి ఒక్కరు మొక్కలు నాటి వాతావరణ సమతుల్యతను కాపాడాలని మహానగర పాలకసంస్థ డిప్యూటీ మేయర్ రిజ్వానాషమ్ మసూద్ అన్నారు. గురువారం గ్రేటర్ వరంగల్ 36వ డివిజన్లోని చింతల్లో వన మహోత్సవంలో భాగంగా మొక్కలు నాటారు. అలాగే అంగన్వాడీ బడి బాట ర్యాలీని ప్రారంభించారు. అనంతరం అంగన్వాడీ కేంద్రంలో చిన్నారులకు అక్షరాభ్యాసం చేయించారు. స్థానికంగా ఉన్న ప్రభుత్వ ఉర్దూ పాఠశాలలో విద్యార్థులకు యూనిఫాంలు, పాఠ్య పుస్తకాలు పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మొక్కలను నాటిన వారే సంరక్షించే బాధ్యతను స్వీకరించాలన్నారు. అంగన్వాడీ కేంద్రంలో టీచర్లు ఆటాపాటలతో చిన్నారులకు విద్యాబుద్దులు నేర్పురాతరని, కాబట్టి చిన్నారులను అంగన్వాడీ కేంద్రాల్లో చేర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉర్దూ మీడియం స్కూల్ చైర్మెన్ సమీన, సీడీపీవో విద్య, సూపర్వైజర్ ఆశ, అంగన్వాడీ టీచర్ సునీత, మణి, పెనీనా, కౌసర్, షాహిన్, ఇంద్ర, మహానంద, శ్రీలత తదితరులు పాల్గొన్నారు.