Revuri Prakash Reddy | రేవంత్ రెడ్డి నువ్వొచ్చినా, నీ అయ్యొచ్చినా, నీ తాతొచ్చినా పరకాల ఎమ్మెల్యేను నేనే అంటూ మంత్రి కొండా సురేఖ కూతురు కొండా సుస్మిత రీసెంట్గా ఓ కార్యక్రమంలో చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్లో తీవ్ర కలకలం సృష్టిస్తోన్న విషయం తెలిసిందే. రేవూరి ప్రకాశ్ రెడ్డిని ఇప్పుడు రాజీనామా చేయించి నువ్వు ప్రచారం చేయి రేవంత్ రెడ్డి.. కచ్చితంగా నేనే నిల్చుంటా.. నేనే గెలుస్తా అర్థమైందా.. నేను ఇండిపెండెంట్గా నిల్చుంటా.. నీ మీద నేను గెలుస్తా.. అంటూ కొండా సుస్మిత చాలెంజ్ విసిరింది.
ఈ నేపథ్యంలో పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి స్పందించారు. నా మీద పిల్లకాకులు ఇష్టమొచ్చినట్టుగా మాట్లాడుతారు.. వాళ్లే ఏదో అంటుంటారు. అది వాళ్ల విజ్ఞతకే వదిలేస్తున్నా. నా పనితనం చూసి రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నేనే ఎమ్మెల్యే అభ్యర్థి అని స్టేజీపైనే ప్రకటించాడంటూ చెప్పుకొచ్చాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట హల్ చల్ చేస్తోంది.
నా మీద పిల్ల కాకులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారు
దాన్ని వారి విజ్ఞతకే వదిలేస్తున్నాను
నా పనితనం చూసి రేవంత్ రెడ్డి వచ్చే ఎన్నికల్లో నేనే ఎమ్మెల్యే అభ్యర్థి అని ప్రకటించాడు
– పరకాల కాంగ్రెస్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి https://t.co/CiePj0W3OZ pic.twitter.com/Bh8bVOLvnx
— Telugu Scribe (@TeluguScribe) August 22, 2026
Smart ration cards | తప్పులతడకగా స్మార్ట్ రేషన్ కార్డుల ముద్రణ.. హరిపురంలో కార్డుల పంపిణీ నిలిపివేత