హన్మకొండ : ఇంటర్మీడియట్ బోర్డు మంగళవారం విడుదల చేసిన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో హన్మకొండలోని రెజోనెన్స్ విద్యాసంస్థలకు చెందిన విద్యార్థిని ఎస్. రోమా యం.పి.సి. విభాగంలో 470 కి గాను 468 (2338104924) రాష్ట్రంలో అత్యధిక మార్కులు సాధించింది. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన అభినందన సభలో విద్యా సంస్థల చైర్మన్ లెక్కల రాజిరెడ్డి మాట్లాడుతూ.. రెజోనెన్స్ విద్యాసంస్థల ఆధ్వర్యంలో జేఈఈ, నీట్ వంటి జాతీయస్థాయి పోటీ పరీక్షల్లోనూ తమ విద్యార్థులు అత్యధిక మార్కులు సాధించినట్లు తెలిపారు. అదేవిధంగా ఇంటర్మీడియట్ ఫలితాల్లోనూ తమ కళాశాల విద్యార్థులు పైచేయిగా నిలిచారని హర్షం వ్యక్తం చేశారు. విద్యాసంస్థలు స్థాపించిన మొదటి సంవత్సరం నుంచి జాతీయ స్థాయిలో నిర్వహించే జేఈఈ, నీట్ పోటీపరిక్షల్లో అద్భుత మార్కులు సాధిస్తూ, ఇంటర్‌లోనూ రాష్ట్ర స్థాయిలో తమ కళాశాల విద్యార్థులు అత్యధిక మారులు సాధించడం అనందంగా ఉందన్నారు. మంగళవారం విడుదలైన ఇంటర్ మొదటి సంవత్సర ఫలితాల్లో రాష్ట్రంలో అత్యధిక మార్కులతో పాటు 121 మంది 470 మారులకు 460 మార్కులకు పైగా సాధించారని, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో 1000 మారులకు 991 మారులు సాధించారన్నారు. వీరితో పాటు 115 మంది 950 మార్కులకు పైగా మారులు సాధించారని హర్షం వ్యక్తం చేశారు. ప్రథమ సంవత్సరం ఫలితాల్లో రాష్ట్ర స్థాయి మార్కులతో పాటు డి. శ్రీహర్షిత 467 మారులు, గుంటి సంజయని 467, బి.దీక్షిత 466 మారులు సాధించారన్నారు.
బైపీసీలో 440 మారులకు కొండపాక చంద్రహాసిని 436, కె. ఆకాంక్ష, బీ ప్రసన్నలక్ష్మి, వి. లాస్య, వి. తేజస్వి 434 మారులు సాధించారన్నారు. ద్వితీయ సంవత్సరంలో సంజన రెడ్డి 991 మారులు, ఎ.మనోజ్ కుమార్ 990 మారులు సాధించారని తెలిపారు. బైపీసీ విభాగంలో జూహా అప్షన్, ఎ.అక్షిత 985 మారులు సాధించారని వివరించారు. ఇదే స్ఫూర్తితో రాబోయే జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లోనూ అత్యంత ప్రతిభ చూపి ఆలిండియా అత్యధిక మార్కులు సాధించాలని ఆకాంక్షించారు. అభినందన సభలో చైర్మన్ శ్రీ లెకల రాజిరెడ్డి, డైరెక్టర్స్ శ్రీ లెకల మహేందర్ రెడ్డి, మాదిరెడ్డి దేవేందర్‌రెడ్డి, సీ.ఈ. వో. డాక్టర్ మునీందర్ ఇరుకుళ్ల, అకడమిక్ డీన్ బీ.యస్. గోపాలరావు పాల్గొని విద్యార్థులను అభినందించారు.