గోవిందరావుపేట, ఫిబ్రవరి12 : మేడారం సమ్మక్క-సారలమ్మ జాతరకు వచ్చే భక్తుల పుణ్య స్నానాల కోసం మండలంలోని లక్నవరం సరస్సు నుంచి జంపన్నవాగులోకి సోమవారం నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం లక్నవరం సరస్సులో 24.7 అడుగుల నీటిమట్టం ఉందని ఐబీ డీఈ శ్రీనివాస్ తెలిపారు.
దయ్యాల వాగులో నీటిమట్టం లేకపోవడంతో జంపన్నవాగులోకి నీరు వెళ్లేలా సరస్సును క్రమక్రమంగా నీటిని విడుదల చేయనున్నట్లు ఆయన చెప్పారు. 20వ తేదీ నాటికి జంపన్నవాగులో లక్షలాది మంది భక్తులు పుణ్య స్నానాలు ఆచరించేందుకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా నీటిని విడుదల చేస్తున్నామని తెలిపారు.