నమస్తే నెట్వర్క్ : ట్రాన్స్కో, జెన్కో, డిసంల లో పనిచేస్తున్న ఆర్టిజన్స్ను వెంటనే కన్వర్షన్ చేయాలని విద్యుత్ కార్మికులు డిమాండ్ చేశారు. ఈ మేర కు హనుమకొండ ములుగు రోడ్డులోని వరంగల్ ట్రాన్స్కో జోనల్, భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని టీజీఎన్పీడీసీఎల్ డీఈ, జనగామలోని కార్యాలయా ల ఎదుట, గణపురం మండలంలోని చెల్పూర్ కేటీపీపీ వద్ద సోమవారం రిలే నిరాహార దీక్షలు ప్రారంభించారు. ఈ సందర్భంగా విద్యుత్ ఆర్టిజన్స్ కన్వర్షన్ రాష్ట్ర జేఏసీ చైర్మన్ కే ఈశ్వర్ రావు మాట్లాడుతూ 20 వేల మందిని కన్వర్షన్ చేయడం వల్ల వి ద్యుత్ సంస్థలపై పెద్దగా ఆర్థిక భారం పడదన్నారు.
వారి విద్యార్హతలను బట్టి జూనియర్ లైన్మెన్, జూనియర్ అసిస్టెంట్, ఆఫీస్ సబార్డినేట్ లేదా అ టెండర్, సబ్ ఇంజినీర్ పోస్టులు ఇవ్వాలని డిమాం డ్ చేశారు. తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని గతంలోనే డిప్యూటీ సీఎం భట్టి విక్రమార, ట్రాన్స్కో సీఎండీలను కలిసి వినతి పత్రాలను సైతం అందజేశామన్నారు. అదేవిధంగా ఫిబ్రవరి 3 నుంచి 13వ తేదీ వరకు కన్వర్షన్ యాత్ర, 20వ తేదీన హైద రాబాద్లో చలో విద్యుత్ సౌధను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో ఆర్టిజన్స్ అందరూ పాల్గొంటారని, అప్పుడు విద్యుత్ సంస్థ కుప్పకూలే ప్రమాదం ఉంటుందని హెచ్చరించారు. కార్యక్రమంలో కేటీపీపీ జేఏసీ చైర్మన్, కన్వీనర్ అల్లం ఓదెలు, బీరెల్లి రాజు, వరంగల్ సరిల్ జేఏసీ చైర్మన్ బండారి ఐలయ్య, కన్వీనర్ కందికొండ వెంకటేశ్ తదితరులు పాల్గొన్నారు.