మహదేవపూర్(కాళేశ్వరం), ఆగస్టు 15 : జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవపూర్మండలంలోని మేడిగడ్డ బరాజ్‌కు ప్రవాహం తగ్గుతున్నది. గురువారం 3,30,830 క్యూసెక్కుల ప్రవాహం రాగా, శుక్రవారం 2,89,710 క్యూసెక్కులకు తగ్గింది. మొత్తం 85 గేట్లు ఎత్తి అంతే మొత్తంలో నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు.
ప్రస్తుత ప్రవాహం బరాజ్ రివర్ బెడ్ నుండి సముద్ర మట్టానికిమ 92.20 మీటర్ల ఎత్తులో ఉందని భారీ నీటి పారుదల శాఖ అధికారులు తెలిపారు. కాళేశ్వరంలో గోదావరి ప్రస్తుత వరద ప్రవాహం సుమారు 4.5 మీటర్ల ఎత్తులో ఉందని పేర్కొన్నారు.