Palakurthi | ఓట్లకు రావద్దంటూ ఫ్లెక్సీ.. రామారావుపల్లిలో వినూత్న నిరసన
తమ వాడకు ఓట్ల కోసం ఎవ్వరు రావద్దంటూ.. పాలకుర్తి మండలం (Palakurthi) రామారావుపల్లెలో వినూత్నంగా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. సర్పంచ్ అభ్యర్థులు, ఎంపీటీసీ అభ్యర్థులు, జడ్పీటీసీ అభ్యర్థులెవరూ తమ వాడకు రావద్దని అందులో పేర్కొన్నారు.
పాలకుర్తి: తమ వాడకు ఓట్ల కోసం ఎవ్వరు రావద్దంటూ.. పాలకుర్తి మండలం (Palakurthi) రామారావుపల్లెలో వినూత్నంగా హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. సర్పంచ్ అభ్యర్థులు, ఎంపీటీసీ అభ్యర్థులు, జడ్పీటీసీ అభ్యర్థులెవరూ తమ వాడకు రావద్దని అందులో పేర్కొన్నారు. మా వాడలో 30 సంవత్సరాలుగా సరైన విద్యుత్ సౌకర్యం లేదు. వీధి దీపాలు లేక రాత్రి అయితే ఇంట్లో నుంచి బయటికి వెళ్లే పరిస్థితి లేదు. ఇంటింటికి మీటర్లు లేవు, రోడ్లు ఉన్నా విద్యుత్ స్తంభాలు లేవు. స్తంభాలు ఉన్నా కరెంటు తీగలు లేవు. విద్యుత్ అధికారులను అడిగితే మీరే చలానా కట్టుకుని విద్యుత్ తీగల కొనుగోలు చేయాలని అంటున్నారు. మాకు చాలనా కట్టే స్తోమతలు లేదు. ఏ అభ్యర్థి అయినా, ఏ పార్టీ వారైనా మాకు సహాయం చేస్తేనే వారికి మా ఓట్లు, లేదంటే ఓట్ల కోసం ఏ రాజకీయ నాయకులు మా వాడకు రావద్దు అంటూ అందులో హెచ్చరించారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
- Tags
- elections
- flex
- MPTC
- palakurthi
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

