నల్లబెల్లి, మార్చి 31 : రంజాన్ పర్వదినం వేడుకలను నల్లబెల్లి మండల కేంద్రంలో ముస్లింలు ఘనంగా నిర్వహించారు. ఈ మేరకు గ్రామంలోని ఈద్గాలో ముస్లింల గురువు మహమ్మద్ రషీద్ స్థానిక ఈద్గాలో ముస్లింలు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు.
ముస్లిం గురువు రషీద్ ముస్లింలు రంజాన్ వేడుకను పురస్కరించుకొని అవలంబించాల్సిన పద్ధతులను వివరించారు. ఈ సందర్భంగా ముస్లింలకు స్థానిక మాజీ తాజా సర్పంచ్ నానబోయిన రాజారాం రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా మండలంలోని అన్ని గ్రామాల ముస్లింలు పెద్ద ఎత్తున ఈద్గా వద్దకు తరలివచ్చి ప్రార్థనలు చేశారు.