దుగ్గొండి, ఏప్రిల్, 21: బీఆర్ఎస్ రజతోత్సవం సందర్భంగా ఉమ్మడి వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించనున్న బీఆర్ఎస్ సభను విజయవంతం చేయాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సుకిన రాజేశ్వరరావు అన్నారు. కేసీఆర్ రాష్ట్రాన్ని పదేండ్లలో అన్ని రంగాల్లో అభివృద్ధి చేశారన్నారు. మల్లంపల్లి, గుడ్డేలుగులపల్లి, చంద్రయ్య పల్లి, నారాయణ తండా, మర్రిపల్లి గ్రామాల్లో సన్నాక సమావేశాలు నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నర్సంపేట మాజీ శాసనసభ్యులు పెద్ది సుదర్శన్ రెడ్డి నాయకత్వంలో నర్సంపేట ప్రాంతం అభివృద్ధి సాధించిందని అన్నారు. భారీ సంఖ్యలో తరలివచ్చి బీఆర్ఎస్ సభను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జడ్పీ మాజీ వైస్ చైర్మన్ ఆకుల శ్రీనివాస్, కొల్లూరి మోహన్ రావు, తోటకూర రాజు, బూర హేమచంద్ర, పల్నాటి కేశవరెడ్డి, పెండ్లి రవి, మాజీ ఎంపిటిసి చంద్రు, మంద ఈశ్వర్, సమ్ము నాయక్, నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.