కాజీపేట/ఖిలా వరంగల్, మార్చి 21: కాజీపేట జంక్షన్ శివారులో నిర్మాణమవుతున్న రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులు శరవేగంగా జరుగుతున్నాయని, త్వరలోనే ప్రారంభించేందుకు సిద్ధం చేస్తున్నట్లు దక్షిణమధ్య రైల్వే జనరల్ మేనేజర్ అరుణ్‌కుమార్ జైన్ అన్నారు. కరీంనగర్, రామగుం డం, వరంగల్ రైల్వే స్టేషన్లలో జరుగుతున్న అభివృ ద్ధి పనులను తనిఖీ చేస్తూ ప్రత్యేక రైలులో ఉన్నతాధికారులతో కలిసి కాజీపేట రైల్వే జంక్షన్‌కు శుక్రవారం చేరుకున్నారు. క్రూ కంట్రోల్ కార్యాలయం లో ఆయన లోకోపైలట్, అసిస్టెంట్ లోకోపైలట్లతో సేఫ్టీ అవగాహనపై ముఖాముఖి కార్యక్ర మం నిర్వహించారు.
రైలు డ్రైవర్ల సమస్యలు తెలుసుకుని వారికి సూచనలు, సలహాలు అందజేసి, రైల్వేశాఖ తీసుకోవాల్సిన జాగ్రత్తలు, బాధ్యతల గురించి వివరించారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఈ ఏడాది డిసెంబర్ నాటికి రైల్వే మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ నిర్మాణ పనులు పూ ర్తయి రైల్ కోచ్‌ల ఉత్పత్తి ప్రారంభమవుతుందన్నా రు. రైల్వే భద్రతే రైల్వే శాఖ లక్ష్యమని, రైల్వేను కాపాడుకోవడం ప్రతి కార్మికుడి బాధ్యత అన్నారు. వరంగల్ రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫాంలు, ఎస్కలేటర్లు, వెయింట్ హాల్‌ను వీక్షించారు. రైల్వేస్టేషన్‌లోని సౌకర్యాలు, వసతుల కల్పనపై ప్రయాణికులను అడిగి తెలుసుకున్నారు.
ఏకే జైన్‌ను బీజీపీ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు కొలను సంతోష్‌రెడ్డి, మాజీ అధ్యక్షురాలు రావు పద్మారెడ్డి మర్యాద పూర్వకంగా కలి సి కాజీపేట రైల్వే దవాఖానను అందుబాటులోకి తేవాలని వినతి పత్రం అందజేశారు. అదేవిధంగా వరంగల్ రైల్వేస్టేషన్‌లోని జీఆర్పీ పోలీస్ స్టేషన్ శిథిలావస్థకు చేరిందని సీఐ సురేందర్ జీఎంకు విన్నవించారు. సికింద్రాబాద్ రైల్వే డీఆర్ఎం భర్తేశ్కు మార్ జైన్, పీసీఈఎం బ్రహ్మానందం, సీపీటీఎం పద్మజ, పీవోఎం మోహన్, సీనియర్ డీవోఎం సురేశ్‌రెడ్డి, సీనియర్ డీఈ శివప్రసాద్ పాల్గొన్నారు.
వరంగల్-కాజీపేట రైల్వేస్టేషన్ల మధ్య జీఎం ఏకే జైన్ ప్రయాణిస్తున్న స్పెషల్ రైలింజన్‌కు బలమైన ఇసుప వస్తువు తాకడంతో పెను ప్రమాదం తప్పిం ది. రైలుకు ఎలాంటి ప్రమాదం జరుగలేదు. ఘట నా స్థలంలో రైలు పట్టా ముక్క దొరికింది. కార్మికు లు విధులు నిర్వర్తించి అధికారి స్పెషల్ రైలు వస్తుందని అక్కడే ఆ రైలు పట్టా ముక్కను వదిలారా? గుర్తుతెలియని వ్యక్తులెవరైనా పెట్టారా?… అంటూ పలు అనుమానాలను రేకెత్తిస్తున్నట్లు రైల్వే అధికారులు చర్చించుకున్నారు. ఈ విషయంపై రైల్వే అధికారులు విచారణ చేపట్టనున్నట్లు సమాచారం.