ఆత్మకూరు, జనవరి 30 : మండలంలోని గూడెప్పాడ్‌లో ఓ కిరాణా షాపులో 40 కిలోల నకిలీ టీ పొడిని వరంగల్ జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు పట్టుకున్నారు. పరకాల రూరల్ సీఐ రంజిత్‌కుమార్ కథనం ప్రకారం.. మేడారం జాతర ఫుడ్ తనిఖీల్లో భాగంగా వరంగల్ జిల్లా పుడ్ సేఫ్టీ అధికారులు కృష్ణమూర్తి, మౌనిక అక్కడి చేరుకున్నారు. దీంతో సీఐ, ఎస్సైల సా యంతో దగ్గరలో ఉన్న ఎంఎం మార్ట్‌కు వెళ్లి టీ పౌడర్‌ను తనిఖీ చేశారు. అక్కడున్న 40 కిలోల టీ పౌడర్‌ను పరిశీలించి నకిలీగా గుర్తించారు.
ఈ సందర్భంగా ప్రజలకు అవగాహన కలిగేలా ఫుడ్ సేప్టీ అధికారి కృష్ణమూర్తి మార్ట్‌లో దొరికిన నకిలీ టీ పౌడర్‌ను, అసలు టీ పౌడర్‌ను గుర్తింపు ను డెమో చేసి వివరించారు. నకిలీ టీ పౌడర్‌లో నీళ్లు పోయడంతోనే వెంటనే సాధారణ ఉష్ణోగ్రతలోనే పూర్తిగా ఎర్రగా మారిందని, ఇలా నకిలీని గుర్తించవచ్చన్నారు. అసలు టీ పౌడర్‌లో వేడి నీళ్లలో ఉడకబెట్టిన తర్వాత నీళ్లు పైకి వస్తాయని, ఎర్రగా మారకుండా ఉంటుందని చూపించారు. పాడైన, ఉపయోగించిన టీ పౌడర్‌లో ప్రమాదకరంగా హేర్డైతో పాటు ఇతరత్రా కలర్స్‌ను వాడు తున్నట్లు ఫుడ్‌సేఫ్టీ అధికారి కృష్ణమూర్తి తెలిపారు. టీ పౌడర్ విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ఏది నకిలీ, ఏది కాదో వెంటనే గుర్తించాలన్నారు. దొరికిన 40 కిలోల నకిలీ టీ పౌడర్‌ను స్వాధీనం చేసుకున్న ఫుడ్‌సేఫ్టీ అధికారులు పరీక్షలనిమిత్తం ల్యాబ్‌కు పంపినట్లు తెలిపారు.