రేపు మేడారంలో శుద్ది పండుగ
మేడారంలో సమ్మక్క, సారలమ్మ పూజారులు నేబు శుద్ది పండుగ (గుడిమెలిగే) పండగను నిర్వహించనున్నారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు, వారి కుటుంబ సభ్యులు ఇళ్లను శుద్ది చేసుకుని డోలివాయిద్యాల నడుమ మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకుంటారు. గుడిని శుద్ది చేసిన అనంతరం సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లి గుట్ట గడ్డి, పుట్ట మట్టిని సేకరించి గద్దెకు చేరుకుంటారు.
- సమ్మక్క గుడికి చేరుకోనున్న పూజారులు
తాడ్వాయి, జనవరి12 : మేడారంలో సమ్మక్క, సారలమ్మ పూజారులు నేబు శుద్ది పండుగ (గుడిమెలిగే) పండగను నిర్వహించనున్నారు. పూజారుల సంఘం అధ్యక్షుడు సిద్దబోయిన జగ్గారావు ఆధ్వర్యంలో పూజారులు, వారి కుటుంబ సభ్యులు ఇళ్లను శుద్ది చేసుకుని డోలివాయిద్యాల నడుమ మేడారంలోని సమ్మక్క గుడికి చేరుకుంటారు. గుడిని శుద్ది చేసిన అనంతరం సమీప అటవీ ప్రాంతంలోకి వెళ్లి గుట్ట గడ్డి, పుట్ట మట్టిని సేకరించి గద్దెకు చేరుకుంటారు.
ఆ గడ్డిని గుడిపై వేసిన అనంతరం సమ్మక్క గద్దెకు మట్టితో అలుకుపూతలు నిర్వహించి దూపదీప నైవేద్యాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేస్తారు. శుద్ది పండగతో మహా జాతర ప్రారంభమైనట్లు పూజారులు భావిస్తారు. సమ్మక్కను చిలకలగుట్ట పైనుంచి గద్దెలపైకి తీసుకువచ్చే ప్రధాన పూజారి కొక్కెర కృష్ణయ్య మహా జాతర ముగిసే వరకు కాళ్లకు చెప్పులు లేకుండా అత్యంత నయమనిష్టలతో పూజలు నిర్వహిస్తుంటారు.
దర్శనానికి తరలొచ్చిన భక్తులు
సంక్రాంతి సెలవులు కావడంతో తెలుగు రాష్ర్టాల నుంచే కాకుండా ఇతర రాష్ర్టాలు మహారాష్ట్ర, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ర్టాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. జంపన్నవాగులో పుణ్యస్నానాలు ఆచరించిన అనంతరం తల్లుల గద్దెలకు చేరుకుని మొక్కులు చెల్లించారు. తెలంగాణ శాసన సభా మండలి డిప్యూటీ చైర్మర్ బండ ప్రకాశ్ తల్లులను దర్శించుకున్నారు. ఆయనకు పూజారులు, దేవాదాయశాఖ అధికారులు స్వాగతం పలికి గద్దెల వద్దకు తీసుకువెళ్లారు. సమ్మక్క, సారలమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. అనంతరం పూజారులు ఆయనకు అమ్మవారి వస్ర్తాలను, ప్రసాదాన్ని అందజేశారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Vijay Deverakonda | ట్యాంక్బండ్పై విజయ్ దేవరకొండ, రష్మిక సందడి.. నేడు సద్దుల బతుకమ్మ వేడుకలకు ‘విరోష్’ జంట!
Varanasi | మహేష్ బాబు – రాజమౌళి ‘వారణాసి’ మూవీ విడుదల వాయిదా? త్వరలోనే కొత్త తేదీ ప్రకటన!
Milan protest | ఇటలీలో భారీ నిరసనలు.. స్టోర్ల లూటీ.. తగలబడ్డ రాజధాని మిలన్.. ఖండించిన జార్జియా మెలోని
Spirit New Poster | ప్రభాస్ ఫ్యాన్స్కి గుడ్ న్యూస్.. ‘స్పిరిట్’ నుంచి కొత్త పోస్టర్, రిలీజ్ డేట్ వచ్చేసింది
Greater Noida | టీ, నూడుల్స్ కారణం కాదు.. ఆ కుటుంబం ఆత్మహత్య చేసుకుంది..!
ట్రెండింగ్ వార్తలు
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్

