నల్లబెల్లి,జులై 11 : పీహెచ్ డి పట్టా సాధించిన పంచాయతీ కార్యదర్శి విష్ణును పీఆర్టీయూ యూనియన్ నాయకులు ఘనంగా సన్మానించారు. ఈ మేరకు ఇటీవల కాకతీయ యూనివర్సిటీ స్నాతకోత్సవంలో రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మచేతుల మీదుగా పొలిటికల్ సైన్స్ విభాగంలో డాక్టరేట్ పట్టా పొందిన రాకం విష్ణును ఎంపీడీవో నరసింహమూర్తి సమక్షంలో వరంగల్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఈదునూరి రవీందర్ రెడ్డి, నక్కిరెడ్డి మహేందర్ ల ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు.
కార్యక్రమంలోపీఆర్టీయూ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఉడుత రాజేందర్, పీఆర్టీయూ టిఎస్ రాష్ట్ర బాధ్యులు గౌని చంద్రశేఖర్, డి శ్రీధర్ బాబు, రామస్వామి, సీహెచ్ రాజేందర్, జిల్లా బాధ్యులు ఎస్ శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు బాలు, ఉపాధ్యాయులు బానోతు బలరాం నాయక్ తదితరులు పాల్గొన్నారు.