కాశీబుగ్గ, ఏప్రిల్ 3 : మంత్రి కొండా సురేఖకు మళ్లీ నిరసన సెగ తగిలింది. వరంగల్ నగరంలోని 23వ డివిజన్ కొత్తవాడలో శుక్రవారం కుట్టుమిషన్ శిక్షణ కేంద్రం ప్రారంభించేందుకు వచ్చిన ఆమెను పలు సమస్యలపై మహిళలు నిలదీశారు. తమ ఇండ్ల ముందు రోడ్లు, డ్రైనేజీలు నిర్మించాలని, మౌళిక సదుపాయాలు కల్పించాలని స్థానిక మహిళలు భాగ్య, రమాదేవి నిలదీశారు.
ఒక్క సారిగా మహిళలు ముందుకు రావడంతో వెంటనే స్పందించిన మంత్రి తొందరలోనే పనులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. అలాగే, చేనేత కార్మికులు తప పరిష్కరించాలని మంత్రి సురేఖకు వివరించి వినతి పత్రం అందజేశారు. ప్రభుత్వం 22 రకాల వస్తువులను ఏకీకృత టెండర్ విధానం ద్వారా ఖరీదు చేస్తున్నట్లు ప్రకటించి, టెస్కో ద్వారా ప్రొక్యూర్మెంట్ రద్దు చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడాన్ని మంత్రి సురేఖ దృష్టికి తీసుకెళ్లారు. వెంటనే స్పందించిన ఆమె వరంగల్ కార్పెట్స్, బెడ్ షీట్స్ కొనుగోలు జరిగేలా చేస్తామని హామీ ఇచ్చారు. చేనేత కార్మికుల ఉపాధి దెబ్బతినకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు.