Jayashankar | ఖిలా వరంగల్ : గ్రేటర్ వరంగల్ 35వ డివిజన్ శివనగర్‌లో తెలంగాణ జాతిపిత ఆచార్య జయశంకర్ జయంతిని సామాజికవేత్త మేరుగు అశోక్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు.
తెలంగాణ ఉద్యమానికి దిక్సూచిగా స్వరాష్ట్రం కోసం నిరంతరం తపించిన మహోన్నత వ్యక్తి జయశంకర్ సార్ అని కొనియాడారు. రాష్ట్ర సాధనే ధ్యేయంగా తాను చేసిన త్యాగాలను ఈ సందర్భంగా స్మరించుకున్నారు. ఈ కార్యక్రమంలో 35వ డివిజన్ పద్మశాలి అధ్యక్షులు గడ్డం రవి డివిజన్ నాయకులు వెంగళదాస్ కృష్ణ, బెరకిషన్, గటిక రాంచందర్, బోగా కుమార్ రోషన్, కస్తూరి రాహుల్, యశ్వంత్, సాయి, దీక్షిత్ తదితరులు పాల్గొన్నారు.