హనుమకొండ, నవంబర్13 : హనుమకొండలోని స్మైల్ డిజీ పాఠశాల కరస్పాంటెండెంట్పై పీడీఎస్‌యూ విద్యార్థి సంఘం నాయకుల దాడిని నిరసిస్తూ గురువారం ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు, ఉపాధ్యాయులు కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ట్రస్మా పిలుపు మేరకు సుమారు 3వేల మందితో ర్యాలీగా కలెక్టరేట్ వద్దకు చేరుకొని రోడ్డుపై బైఠాయించారు. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెల కొన్నాయి. ఈ సందర్భంగా ప్రైవేట్ విద్యా సంస్థల యజమానులు మాట్లాడుతూ కరస్పాంటెండెంట్పై దాడి చేసిన విద్యార్థి సంఘం నాయకులు మర్రి మహేష్, గుర్రం అజయ్‌లపై చట్టపరంగా చర్యలు తీసుకొని కఠినంగా శిక్షించాలన్నారు. అనంతరం స్థానిక ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్, డీఆర్వో వైవీ గణేష్‌కు వినతి పత్రం అందజేసినట్లు వారు తెలిపారు.
కాగా, ఎలాంటి ఘటనలు జరుగకుండా ముందస్తుగా పోలీసులు కలెక్టరేట్ రెండు గేట్లు మూసివేశారు. కార్యక్రమంలో ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు సాదుల మధుసూదన్, కోశాధికారి రాఘవేందర్‌రెడ్డి, వరంగల్, భూపాలపల్లి, మహబూబాబాద్, జనగామ, ములుగు, కరీంనగర్ జిల్లా అధ్యక్షులు చల్లా నాగార్జునరెడ్డి, సాంబయ్య, ఏకాంతగౌడ్, కొమురయ్య, హనుమకొండ జిల్లా జనరల్ సెక్రటరీ జ్ఞానేశ్వర్, ట్రెజరర్ ముక్తేశ్వర్, శ్రీ కాంత్‌రెడ్డి, రాంబాబు, రమేశ్, శ్రీనివాస్, వీ సత్యనారాయణరెడ్డి, వేణుమాధవరావు, ట్రెస్మా చీఫ్ అడ్వైజర్ నారాయణరెడ్డి, కే భూపాల్‌రావు, పరంజ్యోతి, టీ బుచ్చిబాబు, ఎడ్ల శ్రీనివాస్‌రెడ్డి పాల్గొన్నారు.
సుబేదారి : స్మైల్ డిజీ సూల్ కరెస్పాంటెండెంట్పై దాడి చేసి, ఫర్నిచర్‌ను ధ్వంసం చేసిన పీడీఎస్‌యూ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు అజయ్, కార్యదర్శి మహేశ్‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారిని రిమాండ్‌కు తరలించినట్లు హనుమకొండ ఇన్స్పెక్టర్ మచ్చ శివకుమార్ తెలిపారు.