వరంగల్ చౌరస్తా : పట్టణ ఆర్యవైశ్య సంఘంపై దాడులకు, సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడిన వారిపై త్వరలో చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడంతో పాటుగా అసభ్య పథజాలంతో దూషించి, నిరాధార ఆరోపణలు చేసిన వ్యక్తులపై పరువు నష్టం దావా వేస్తామని పట్టణ ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు గుండా ప్రకాష్ రావు అన్నారు. మంగళవారం ఆయన సంఘం కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు.
తాను విదేశీ పర్యటనలోవున్న సమయంలో స్థానిక ప్రజాప్రతినిధులను తప్పుదోవ పట్టించి పట్టణ అర్యవైశ్య సంఘం అస్తులపై దాడులు, సిబ్బందిపై బెదిరింపులకు పాల్పడి నగదు ఎత్తుకల్గిన వ్యక్తులపై (గోరంటల యాదగిరి) పోలీసులకు ఫిర్యాదు చేశారని, సంఘం చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటుందని అన్నారు. పొట్టకూటి కోసం ఉద్యోగాలు చేసుకుంటున్న మహిళా సిబ్బందిపై అమర్యాదగా ప్రవర్తించి, అసభ్య పదజాలంతో దూషించిన సభ్యులు (గట్టు మహేష్ బాబు) తను మాట్లాడని మాటలపై ఆత్మ పరిశీలన చేసుకోవాలని హితవు పలికారు.
స్వలాభం కోసం, పదవుల కోసం ఏ నాడు సంఘాన్ని వాడుకోలేదని, గతంలో ఎన్నికలు నిర్వహించడానికి ఏర్పాట్లు చేస్తున్న క్రమంలో కొందరు వ్యక్తులు కోర్టును ఆశ్రయించి ఎన్నికలకు స్టే అర్డర్ తీసుకురావడం, తదుపరి కరోనా కాలం, కోర్టు వ్యవహారం తేలకపోవడం మూలంగానే ఎన్నికలు నిర్వహించలేదని అన్నారు. త్వరలో కోర్టు వ్యవహారాన్ని ముగించి చట్ట ప్రకారంవున్న 16వేల మంది ఓటర్లతో ఎన్నికలు నిర్వహించడానికి తాము సిద్ధంగా వున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో మల్యాల నరమల్లయ్య, దాచేపల్లి సీతారాం, సంఘం సిబ్బంది పాల్గొన్నారు.