పర్వతగిరి, సెప్టెంబర్ 20: పోలీసుల అత్యుత్సాహంతో మహిళలు శనివారం రాత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. వివరాల్లోకి వెళ్తే.. మండలకేంద్రంలో మహిళలు సౌండ్ బాక్స్ పెట్టుకొని బొడ్డెమ్మ నిమజ్జన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. బతుకమ్మ.. బతుకమ్మ ఉయ్యాలో.. ఆరు గ్యారంటీలు అమలు కాకపాయే ఉయ్యాలో..! అంటూ సౌండ్ బాక్స్‌లో వస్తున్న పాటలకు వారు నృత్యాలు చేస్తున్నారు.
ఈ క్రమంలో పోలీసులు వచ్చి సౌండ్ బాక్స్‌లను లాక్కెళ్లారు. దీంతో తమ మనోభావాలు దెబ్బ తీశారని మహిళలు ఆగ్రహం వ్యక్తం చేశారు. బాక్సులు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పోలీస్‌స్టేషన్‌కు ఆడెపు ధనలక్ష్మి, నీలం మహాకనకలక్ష్మి, శ్రీరాముల మాధవి, చిదురాల శ్రీలత, చిన్న మాధవి, స్వరూప, లక్ష్మి, బుజ్జమ్మ, సునీతతోపాటు మరో 15 మంది చేరుకొని సిబ్బందితో వాగ్వాదం చేశారు.