గణపురం, మే 20 : జయశంకర్ భూపాలపల్లి జిల్ల గణపురం మండలం బుర్రకాయలగూడెం ఐకేపీ కొనుగోలు కేంద్రం వద్ద సోమవారం జరిగిన దాడి ఘటనపై స్థానిక ఎస్ఐ అశోక్ ఆధ్వర్యంలో మంగళవారం విచారణ చేపట్టారు. దాడి జరిగిన సమయంలో కొనుగోలు కేంద్రం వద్ద ఉన్న మహిళలు, రైతులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. గొడవ జరిగిన తీరుపై ఆరా తీశారు.
సోమవారం జరిగిన దాడి ఘటనపై బాధితుల నుంచి ఫిర్యాదు తీసుకొని మాజీ ఎంపీటీసీ కాల్యా సాగర్‌తోపాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. అదేవిధంగా మహిళా సమాఖ్య ఏపీఎం ఇమామ్, సీపీ బాబాను పిలిపించి కొనుగోలు కేంద్రాల వద్ద ఎలాంటి సమస్య తలెత్తకుండా చూడాలని సూచించారు.