తెలంగాణ ప్రజలకు గులాబీ జెండా అండగా నిలుస్తున్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. దామెర మండల కేంద్రంలో పరకాల, నడికూడ మండలాల్లోని గ్రామాల వారీగా బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. బీఆర్ఎస్ పాలనలో ప్రతి పేద ఇంటికీ సంక్షేమ ఫలాలు అందుతుండడంతో ప్రజలంతా సంతోషంగా ఉన్నారన్నారు. రాష్ట్రానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం చేసిందేమీ లేదని, విపక్షాల అసత్య ఆరోపణలను పార్టీ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. పరకాల మండలం హైబోత్పల్లి గ్రామానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నాయకులు పార్టీలో చేరగా, వారికి ఎమ్మెల్యే గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.
పరకాల/నడికూడ, ఏప్రిల్ 16: రాష్ట్ర ప్రజలకు గులాబీ జెండా అండగా నిలుస్తుందని, సీఎం కేసీఆర్ పాలనలో అన్ని వర్గాల వారు సంతోషంగా ఉన్నారని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. ఆదివారం దామెర మండలం ఏఎస్ఆర్ గార్డెన్స్‌లో పరకాల మండలం మల్లక్కపేట, వెం కటాపురం, హైబోత్పల్లి, లక్ష్మీపురం, నాగా రం గ్రామాలు, నడికూడ మండలం ధర్మా రం, కౌకొండ, రామకృష్ణాపురం, కంఠాత్మకూర్, నడికూడ గ్రామాల ఆత్మీయ సమ్మేళనాన్ని వేర్వేరుగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణుల సమస్యలను ఎమ్మెల్యే అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మా ట్లాడుతూ ప్రత్యేక రాష్ట్రంలో ప్రజలందరూ సంతోషంగా ఉన్నారన్నారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధి, సంక్షేమమే ధ్యేయంగా పాలన కొనసాగిస్తున్నారన్నారు. బీఆర్ఎస్ అంటేనే భరోసా అని, పార్టీకి కార్యకర్తలే బలమన్నారు. రాష్ట్రంలో మూడోసారి అధికారంలోకి రావడం ఖాయమని, అందుకు బీఆర్ఎస్ శ్రేణులు కలిసికట్టుగా కృషి చేయాలన్నారు.
దేశంలో ఎక్కడాలేని విధంగా రాష్ట్రంలో సంక్షేమ పాలన కొనసాగుతోందన్నారు. త్వరలోనే సొంత స్థలం ఉండి ఇల్లు నిర్మించుకోవాలనుకునే వారు స్థానిక తహసీల్ కార్యాలయాల్లో ధరఖాస్తు చేసుకోవాలని, ఇంటి నిర్మాణం కోసం ప్రభుత్వం రూ.3లక్షల ఆర్థికసాయం అందిస్తుందన్నా రు. రాష్ట్రంలో సబ్బండ వర్గాలకు తెలంగాణ ప్రభుత్వం అండగా నిలుస్తుందన్నారు. రాష్ర్టానికి కేంద్ర ప్రభుత్వం చేసిందేమీ లేదన్నారు. కానీ, బీజేపీ నాయకులు తెలంగాణపై విషం చిమ్మే విధంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. వారు చేసిన అసత్య ఆరోపణలను బీఆర్ఎస్ శ్రేణులు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ముఖ్యంగా గ్రామాల్లోని యువతను బీజేపీ నాయకులు తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. అసత్య ఆరోపణలు చేసే బీజేపీ నాయకులకు తగిన బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో పార్టీ ఆయా మండలాల అధ్యక్షులు చింతిరెడ్డి మధుసూదన్ రెడ్డి, ధూరిశెట్టి చంద్రమౌళి, జడ్పీటీసీ మొగిలి, బీఆర్ఎస్ నాయకులు నేతాని శ్రీనివాస్‌రెడ్డి, చింతిరెడ్డి సాంబరెడ్డి, భీముడి నాగిరెడ్డి, బొజ్జం రమేశ్, పలు గ్రామాల సర్పంచ్‌లు, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరికలు
బీఆర్ఎస్లో చేరికల పరంపర కొనసాగుతోంది. పరకాల మండలంలోని హైబోత్పల్లికి చెందిన బీజేపీ, కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్లో చేరారు. వీరికి ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి గులాబీ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ దేశ ప్రజలు తెలంగాణ మోడ ల్ అభివృద్ధిని కోరుకుంటున్నారన్నారు. అభివృద్ధిలో భాగస్వాములయ్యేందుకే అన్ని పార్టీల నాయకులు బీఆర్ఎస్లో చేరుతున్నారన్నారు. ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. ప్రతి కార్యకర్తకు అండగా ఉంటానన్నారు. పార్టీలో చేరిన వారిలో ఎండీ మీరా సాహెబ్, రఫీక్, షుకూర్, రజా క్, రాజాసాహెబ్, రాజ్‌మహ్మద్, మొహినొద్దీన్, కుమ్మరి రాజేశ్ ఉన్నారు.