Warangal | దుగ్గొండి, జూన్ 18 : మండలంలోని పలు గ్రామాల ప్రజలు తీర్థయాత్రలు, దూర ప్రయాణాలు చేసేటప్పుడు ఇంట్లో విలువైన వస్తువులు, ఆభరణాలను జాగ్రత్తగా భద్రపరుచుకోవాలని దుగ్గొండి ఎస్సై రావుల రణధీర్ పేర్కొన్నారు. బుధవారం స్టేషన్ ఆవరణలో వారు మాట్లాడుతూ ఇండ్లకు సెంట్రల్ లాకింగ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని లేని పక్షంలో ఇంటి వద్ద ఎవరినైనా కుటుంబ సభ్యులను ఉండే విధంగా తగు జాగ్రత్తలు తీసుకోవాలని మండల ప్రజలకు ఎస్ఐ సూచించారు.