నల్లబెల్లి, మే 15 : పెద్దమ్మ తల్లి విగ్రహా ప్రతిష్టాపన కార్యక్రమం వైభవంగా జరిగింది. మండలంలోని నారక్కపేట గ్రామంలో వేద పండితుల మంత్రోచ్ఛరణలు, మంగళవాయిద్యాల నడుమ భక్తజనుల కోలాహాలం మధ్య బుధవారం శ్రీ పెద్దమ్మతల్లి విగ్రహ పతిష్టాపన అంగరంగా వైభవంగా జరిగింది. ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ముఖ్యఅతిథిగా విచ్చేసి ఆలయంలో పూజలు నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ పెద్దమ్మ తల్లి ఆశీస్సులు ప్రజలందరికి సమృద్ధిగా లభించాలని అమ్మవారిని కోరుకున్నట్లు తెలిపారు.
రూ.12 లక్షల వ్యయంతో నిర్మించిన పెద్దమ్మతల్లి ఆలయంలో దేవత మూర్తులైన శ్రీ పెద్దమ్మతల్లి, పోతరాజు విగ్రహాలను నెలకొల్పారు. దీంతో గ్రామంలో మూడు రోజులుగా అత్యంత వైభవంగా జరుగుతున్న ఉత్సవ కార్యక్రమంలో బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి, మేఫా జిల్లా అధ్యక్షుడు పులి దేవేందర్, మండల అధ్యక్షుడు గుబరాజు తోపాటు వివిధ పార్టీల లీడర్లు, భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమంలో పూజారులు భహ్మశ్రీ దంచనాల వీరభద్రచార్యులు, ఆసం సుదర్శనచార్యులు, రమేష్చార్యులు పాల్గొన్నారు.