హనుమకొండ, డిసెంబర్ 6 : అంబేదర్ స్ఫూర్తిని కొనసాగిస్తూ, ఆయన ఆశయ సాధనకు ప్రతి ఒక్కరం కృషి చేద్దామని మాజీ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాసర్ అన్నారు. అంబేద్కర్ వర్ధంతి సందర్భంగా బుధవారం హనుమకొండలోని అంబేదర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. అణగారిన వర్గాలకు అండగా నిలిచిన మహోన్నత వ్యక్తి బీఆర్ అంబేదర్ అని కొనియాడారు. సాధారణంగా అంబేదర్ పేరును వీధికి ఏర్పాటు చేసుకుంటారని, కానీ కేసీఆర్ మాత్రం సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడంతో పాటు 125 అడుగుల విగ్రహం ఏర్పాటు చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో కుడా చైర్మన్ సుందర్రాజ్ యాదవ్, రాష్ట్ర రైతు రుణ విమోచన కమిషన్ చైర్మన్ నాగుర్ల వెంకటేశ్వర్లు, కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి పాల్గొన్నారు.
గొప్ప గులాబీ సైనికుడిని కోల్పోయాం
హనుమకొండ : గొప్ప గులాబీ సైనికుడిని కోల్పోయామని దాస్యం అన్నారు. బాలసముద్రంలోని బీఆర్ఎస్ జిల్లా కార్యాలయంలో బీఆర్ఎస్ జడ్పీ చైర్మన్ పాగాల సంపత్‌రెడ్డి సంస్మరణ సభ నిర్వహించారు. సంపత్‌రెడ్డి చిత్రపటానికి పూల మాల వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జనగామలో బీఆర్ఎస్ పార్టీని బలోపేతం చేసిన గొప్ప నాయకుడు పాగాల సంపత్‌రెడ్డి అని అన్నారు. పార్టీ ఏ బాధ్యత అప్పగించినా సమర్థవంతంగా నిర్వహించిన నాయకుడని అన్నారు. సంపత్‌రెడ్డి కుటుంబానికి బీఆర్ఎస్ కుటుంబసభ్యులు, తాను అండగా ఉంటానని తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పశ్చిమ నియోజకవర్గ కో ఆర్డినేటర్ జనార్దన్ గౌడ్ పాల్గొన్నారు.