గణపురం, మార్చి 10: తమ గ్రామాన్ని వెంటనే తరలించాలని, నీళ్లు, పనులు లేక ఆకలితో అల్లాడుతున్నామని జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలోని పరశురాంపల్లి గ్రామస్తు లు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు పునరావాస ప్యాకేజీ అందించి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ కేటీకే ఓసీ-3 ప్రధాన రహదారిపై టెంటు వేసుకొని సుమారు 5 గంటలపాటు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా పరశురాంపల్లి గ్రామస్తులు మాట్లాడుతూ పొలాలు మొత్తం తీసుకొని గ్రామాన్ని తరలించకపోవడంతో పనులు లేక పస్తులుంటున్నామన్నారు.
ఓసీ-3 లో 90 శాతం వ్యవసాయ భూములు కోల్పోయి ఉపాధి లేకుండాపోయిందన్నారు. గ్రామంలో సింగరేణి ఏర్పడితే ఉద్యోగాలు వచ్చి తమ బతుకులు మారతాయని ఆశపడ్డామని, కానీ ఉపాధి కల్పించడంలో సంస్థ పూర్తి గా విఫలమైందన్నారు. బ్లాస్టింగ్లతో ఇండ్లు నెర్రెలు బారుతున్నాయని, దు మ్ము ధూళితో వ్యాధుల బారిన పడుతున్నామన్నారు. సింగరేణి జీఎం రాజేశ్వర్రెడ్డి, అడిషనల్ జీఎం కవీంద్ర అక్కడికి చేరుకొని ఊరు తరలింపుపై గ్రా మస్తులు లిఖితపూర్వకంగా రాసిస్తే ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి నెల రో జు ల్లో సమస్యను పరిషరిస్తానని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.