నుమకొండ చౌరస్తా, సెప్టెంబర్ 18: హనుమకొండ బస్టాండ్ జంక్షన్‌కు ఇరువైపులా బస్సులు పార్కింగ్ చేయడం వలన ట్రాఫిక్ ఇబ్బంది జరుగుతుందని, హయగ్రీవాచారి గ్రౌండ్, కరెంట్ ఆఫీస్ పక్కన కుడా స్థలంలో కేటాయించాలని అద్దెబస్సుల యజమానుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు లక్కం ప్రభాకర్, వరంగల్ రీజినల్ అధ్యక్షుడు మరిపెల్లి రామిరెడ్డి తెలిపారు. ఈ మేరకు వారు గురువారం మున్సిపల్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌ని కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. 20 సంవత్సరాలుగా ఆర్టీసీలో అన్‌ఎంప్లాయిడ్ స్కీం కింద అద్దె బస్సులను నడుతున్నామని, అద్దెబస్సులను పార్కింగ్ చేసేందుకు స్థలం లేదన్నారు. బస్‌స్టేషన్ జంక్షన్లో పార్కింగ్ చేస్తే ట్రాఫిక్ పోలీసులు ఇబ్బందులు పెడుతున్నారని కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు.