ఐనవోలు(హనుమకొండ) : కోర్టు తీర్పును సంబంధిత అధికారులు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ పంతిని గ్రామస్తులు రాస్తారోకో చేశారు. వివరాల్లోకి వెళ్తే..ఐనవోలు మండలంలోని పంతిని శివారులో నల్లమార్మెవాగు బిడ్జి వద్ద ఎలాంటి అనుమలుతు లేకుండా అక్రమంగా నిర్మించిన ఓ ఫంక్షన్ హాల్ నిర్మాణాన్ని కూల్చివేయాలని కోర్టు తీర్పు ఇచ్చిన అధికారులు అమలు చేయడం లేదన్నారు.
ఎఫ్ఎఎల్, బఫర్‌జోన్‌లో అక్రమంగా నిర్మాణం చేసిన ఫంక్షన్హాలను అధికారులు వెంటనే స్పందంచి కోర్టు తీర్పును అమలు చేస్తూ ఫంక్షన్ హాల్‌ను కూల్చి వేయాలని డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టర్ దృష్టిసారించి అక్రమ నిర్మాణం పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో గ్రామస్తులు విక్రమరావు, ఎం యాకయ్య, భాస్కర్ రావు, పూర్ణచందర్రావు, ఎం కుమారస్వామి, ఎం రాజు, ఎం లక్ష్మి, ఎం సాంబయ్య, పీ శశిధర్, రాజు, వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.