చెన్నారావుపేట, మార్చి 12: ప్రమాదవశాత్తు వ్యవసాయ బావిలో పడి ఒకరు మృతి చెందిన ఘటన మండలంలోని జల్లి గ్రామంలో బుధవారం జరిగింది. స్థానికకులు, పోలీసుల కథనం ప్రకారం.. గ్రామానికి చెందిన తొగరు విజయ్‌పాల్‌రెడ్డి(46) నర్సంపేటలో ఫ్లైవుడ్ వ్యాపారంతోపాటు ఇంటి వద్ద వ్యవసాయం చేస్తున్నాడు. బుధవారం ఉదయం వాకింగ్ కోసం వ్యవసాయ క్షేత్రానికి వెళ్లాడు.
మధ్యాహ్నం వరకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం వద్దకు వెళ్లి చూడగా బైక్ కనిపించింది. చుట్టుపక్కల వెతకడంతో వ్యవసాయ బావిలో అతడు శవమై కనిపించాడు. ప్రమాదవశాత్తు బావిలో పడడంతో ఈత రాక మృతి చెంది ఉంటాడని స్థానికులు తెలిపారు. మృతుడి తల్లి సులోచన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రాజేశ్‌రెడ్డి తెలిపారు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు.