హనుమకొండ, సెప్టెంబర్ 25: చారిత్రక వేయిస్తంభాల రుద్రేశ్వరాలయంలో రుద్రేశ్వరీదేవి శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా 4వరోజు మహాలక్ష్మీదేవిగా అలకరించి లక్ష కుంకుమార్చన ఘనంగా చేయించారు. అనంతరం ఎమ్మెల్యే సతీమణి నాయిని నీలిమ విజయవాడ నుంచి తెప్పించిన 12 రకాల పుష్పాలు లిల్లీ, 5 రకాల చామంతులు, 5 రకాల గులాబీపూలతో లలితాసహస్త్రనామం లక్ష్మీసహస్త్రనామం దేవీఖడ్గమాలతో లక్షపుష్పార్చన ఆలయ వేదపండితులు గంగు మణికంఠశర్మ, విజయకుమారచార్యులు, సందీప్‌శర్మ, ప్రణవ్, ప్రసాద్, ఆలయ ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ పూజలు నిర్వహించారు.
అమ్మవారికి పరమాన్న నైవేద్యం అనంతరం యాగశాలలో మహాసుదర్శన హోమం, చండీహోమం నిర్వహించారు. సీఎంఆర్ షాపింగ్‌మాల్ ఆధ్వర్యంలో మహాన్నదానం నిర్వహించారు. టిరెడ్డి రవీందర్‌రెడ్డి, కోన శ్రీఖర్, స్వరూప, మహిళా భక్తులు పూజలో పాల్గొన్నారు. సాయంకాల సమయంలో బోడిగ లక్ష్మీనారాయణ భాగవతార్‌చే హరికథా కాలక్షేపం నిర్వహించారు. 26న అమ్మవారికి లక్షతులసీ అర్చన నిర్వహించనున్నట్లు ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ తెలిపారు.