వరంగల్ : నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డి కోరిక మేరకు మంగళవారం నర్సంపేట పట్టణంలోని పురాతన దేవాలయాలను దేవదాయ శాఖ స్థపతి వళ్లి నాయగం, దేవాదాయ శాఖ ఎస్ఈ మల్లికార్జున రెడ్డి సందర్శించారు.
నర్సంపేట పట్టణంలో 21వ వార్డులోని వెంకటేశ్వర స్వామి దేవాలయం, 6వ వార్డులోని వేణు గోపాల వెంకటేశ్వర స్వామి దేవాలయాలను సందర్శించారు. దేవాదాయ శాఖ ద్వారా ఈ దేవాలయాలను మరింత అభివృద్ధి పరిచేందుకు ప్రణాళికలు చేయనున్నట్లు, ప్రతిపాదనలను సంబంధిత మంత్రిత్వశాఖకు పంపి త్వరలో ఆలయాల అభివృద్ధి, పునఃనిర్మాణ పనులను ప్రారంభించనునట్లు వారు తెలిపారు.
నర్సంపేట నియోజకవర్గ పరిధిలోని అనేక పురాతన దేవాలయాలను గుర్తించి దేవాదాయ శాఖా ద్వారా నిధులను కేటాయిపజేసి అభివృద్ధి చేయనున్నామని ఈ సందర్భంగా వారు పేర్కొన్నారు.
కార్యక్రమంలో నర్సంపేట మున్సిపల్ చైర్ పర్సన్ గుంటి రజని, వైస్ చైర్మన్ మునిగాల వెంకట రెడ్డి, జెడ్పీ టీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న, కౌన్సిలర్లు రామసహాయం శ్రీదేవి, తదితరులు
పాల్గొన్నారు.