రఘునాథపల్లి జనవరి 31 : రాష్ట్ర ప్రభుత్వం నిర్వహిస్తున్న కంటి వెలుగు వైద్య శిబిరాలను ప్రజలు వినియోగించుకోవాలని జాతీయ నాణ్య తా ప్రమాణాల పరిశీలన బృందం సభ్యులు కోరా రు. మంగళవారం మండల కేంద్రంలోని కంటి వెలుగు శిబిరాన్ని కేంద్రంలోని జాతీయ నాణ్య తా ప్రమాణాల పరిశీలన బృందం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా ‘రోజుకు ఎంత మం దికి నేత్ర పరీక్షలు చేస్తున్నారు.. ఎంత మందికి కంటి అద్దాలు ఇస్తున్నారు..’ అని వైద్యులు, సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం రికార్డులను పరిశీలించి సంతృప్తి వ్య క్తం చేశారు.
వైద్య శిబిరానికి వచ్చిన ప్రజలకు అద్దాలు ఇస్తున్నారా? మెరుగైన వైద్యం కోసం పేషెంట్లను ఎక్కడికి రెపర్ చేస్తున్నారని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. అనంతరం బృందం సభ్యుడు కుల్విందర్‌సింగ్ మాట్లాడుతూ అంధత్వ రహిత సమాజం కోసం తెలంగాణ ప్రభుత్వం కృషి చేస్తున్నదని, కంటి వెలుగు కార్యక్రమాన్ని రెండో విడుతగా నిర్వహిస్తున్నదన్నారు. ప్రైవేట్ దవాఖానలకు వెళ్లకుండా ప్రజల కోసం ఉచితంగా అందిస్తున్న సేవలను అందరూ సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అనంతరం వైద్యులతో మా ట్లాడి పలు సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో బృందం వైద్యులు రాజేష్‌ఖన్నా, జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి మహేందర్, డిప్యూటీ డీఎం అండ్ హెచ్‌వో అశోక్‌కుమార్, డాక్టర్ భాస్కర్, శ్రీనివాస్, క్వాలిటీ జిల్లా మేనేజర్ స్రవం తి, ప్రోగ్రాం ఆఫీసర్ రాజశేఖర్, భానుప్రకాశ్, శ్రీతేజ, మండల వైద్యాధికారి కమల్‌హాసన్, సీహెచ్‌వో రెహమాన్, హైల్త్ సూపర్వైజర్లు బిక్కునాయక్, ఝాన్సీరాణి, విష్ణున్వర్దన్రెడ్డి పాల్గొన్నారు.