నర్సంపేట రూరల్, నవంబర్ 22 బీఎల్వోలు కొత్త ఓటర్లను నమోదు చేయాలని ఆర్డీవో శ్రీనివాసులు అన్నారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్వోలకు ఓటరు నమోదు, మార్పులు, చేర్పులపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆర్డీవో మాట్లాడుతూ బీఎల్వోలు అన్ని పోలింగ్ కేంద్రాల్లో అందుబాటులో ఉండాలన్నారు. కొత్త ఓటర్ నమోదుపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. కొత్త ఓటర్ నమోదు, చేర్పులు, మార్పుల కోసం డిసెంబర్ 8లోగా <రఖాస్తులు చేసుకోవాలన్నారు.
ఈనెల 26, 27 తేదీల్లో, డిసెంబర్ 3, 4 తేదీల్లో ముసాయిదా ఓటర్ల జాబితా నియోజకవర్గంలోని అన్ని బూత్‌లో అందుబాటులో ఉంచాలని సూచించారు. ఓటర్ జాబితాలో పేర్లు, కుటుంబ సభ్యుల పేర్లు లేకుంటే వెంటనే అక్కడికక్కడే నమోదు చేసుకొనే అవకాశం ఉందన్నారు. ఈఓటర్ జాబితా ప్రకారమే రాబోయే ఎన్నికలు జరుగుతాయన్నారు. ముఖ్యంగా బీఎల్వోలు ఎన్రోల్మెంట్పై ప్రత్యేక దృష్టిసారించాలని సూచించారు. తహసీల్దార్ వాసం రామ్మూర్తి, డిప్యూటీ తహసీల్దార్ ఉమారాణి, ఆర్ఐ రజాక్, ఎలక్షన్ డీటీ సంధ్యారాణి, జూనియర్ అసిస్టెంట్ పెండ్లి రంజిత్‌రెడ్డి, బీఎల్వోలు పాల్గొన్నారు.
దుగ్గొండి : ఈనెల 26, తేదీల్లో చేపట్టిన ప్రత్యేక ఓటరు నమోదును బీఎల్వోలు విజయవంతం చేయాలని దుగ్గొండి తహసీల్దార్ సంపత్‌కుమార్ అన్నారు. మంగళవారం తహసీల్దార్ కార్యాలయంలో బీఎల్వోలు, రెవెన్యూ సిబ్బందితో ఓటరు నమోదుపై అవగాహన కల్పించారు. తహసీల్దార్ మాట్లాడుతూ ఆయా రోజుల్లో బీఎల్వోలు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5గంటల వరకు పోలింగ్ స్టేషన్లలో అందుబాటులో ఉండాలన్నారు. నాయబ్ తహసీల్దార్, గిర్ధావర్, బీఎల్వోలు, వీఆర్ఏలు పాల్గొన్నారు.