హనుమకొండ చౌరస్తా, అక్టోబర్ 18: హనుమకొండలోని ఏకశిల హాస్పిటల్స్‌లో మొదటిసారిగా ఆధునాతన ఓసీటీ మిషన్(స్టంట్స్ వేసే మిషన్)ను అందుబాటులోకి తీసుకువచ్చినట్లు మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ జి.రమేశ్, ఛైర్మన్ కరుణాకర్‌రెడ్డి, ప్రముఖ గుండె వైద్యనిపుణులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రముఖ కార్డియాలజిస్ట్‌లు అనిల్ బన్న, రామకృష్ణారెడ్డి, మధు, వెంకన్న, భగీరథ, మల్లికార్జున్, అనిల్‌రెడ్డి, మాధవి, లావణ్య మాట్లాడుతూ ఓసీటీ మిషన్ ద్వారా గుండెకు అంజియోగ్రామ్ చేసే సమయంలోనే మూసుకుపోయిన అతి క్లిష్టమైన రక్తనాళాల సైజుని, వేయాల్సిన స్టంట్ సైజ్‌ని నిర్ధిష్టంగా పరిగణించి కార్డియాలజిస్ట్‌లు అతి సులభంగా స్టంట్ వేసేందుకు ఉపయోగపడుతుందన్నారు. గతంలో స్టంట్ సైజ్ నిర్దష్టంగా తెలియకపోవడం వలన 10-15 శాతం స్టంట్స్ మూసుకుపోయే ప్రమాదం ఉండేది కానీ ఈ మిషన్(ఓసీటీ) ద్వారా రక్తనాళాలోకి ప్రత్యక్షంగా చూసుకుంటూ నిర్ధిష్టమైన కొలతలతో కూడిన స్టంట్స్‌ని గురైన, నిర్ధిష్టమైన ప్రదేశంలో స్టంట్స్‌ని అమర్చవచ్చని దీని ద్వారా పాత పద్ధతిలో స్టంట్స్ వేయడం వలన వచ్చే నష్టాలను నివారించవచ్చని వారు చెప్పారు. హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అవసరం లేకుండా మొదటిసారిగా ఏకశిలలో అందుబాటులోకి తీసుకువచ్చినట్లు వారు తెలిపారు.