కరీమాబాద్, జనవరి 23: మహనీయులను మరువొద్దని, వారి ఆశయాలకనుగుణంగా పనిచే యాలని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. నేతాజీ ఆదర్శ పరపతి సంఘం, సుభాష్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కరీమాబాద్ సుభాష్ సెంటర్లో సోమవారం నేతాజీ జయంతిని నిర్వ హించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ సుభాష్ చంద్రబోస్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులర్పించారు. అనంతరం మా ట్లాడుతూ యువతకు నేతాజీ ఆదర్శప్రాయుడని అన్నారు. ఆయన ఆశయ సాధనకు పాటుపడాల ని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో వరంగల్ ఏసీ పీ గిరికుమార్, కార్పొరేటర్ సిద్దం రాజు, మాజీ కార్పొరేటర్లు పల్లం రవి, కత్తెరశాల వేణుగోపాల్, పల్లం రవి, కుడా సలహా మండలి సభ్యుడు మో డం ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
సీఆర్సీ సెంటర్లో..
ఉర్సు సీఆర్సీ సెంటర్లో నేతాజీ జయంతిని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే నరేంద ర్ నేతాజీ విగ్రహానికి పూలమాల వేశారు. అనంత రం పండ్లు పంపిణీ చేశారు. కార్యక్రమంలో కార్పొ రేటర్ రవి, 40వ డివిజన్ బీఆర్ఎస్ అధ్యక్షుడు పూజారి విజయ్, ఆరెల్లి రవి, కోరె కృష్ణ, గుడిమెల్ల రాజు, వనం మధు, దూడ కొంరెల్లి, పసునూరి రమేశ్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సీఆ ర్సీ సెంటర్లో నిర్వహిస్తున్న కంటి వెలుగు కేంద్రాన్ని పరిశీలించారు.