హనుమకొండ చౌరస్తా, జూలై 9: వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో ఈనెల 10న ఒక రోజు జాతీయ స్థాయి అవగాహన కార్యక్రమం ‘ఆవిష్కరణను ప్రోత్సహించడం సృజనాత్మకతను పరిరక్షించడం’ అనే అంశంపై నిర్వహించినట్లు వరంగల్ ప్రభుత్వ పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్ డాక్టర్ బైరి ప్రభాకర్ తెలిపారు. ఈ కార్యక్రమం భారత ప్రభుత్వ విజ్ఞాన సాంకేతిక శాఖ (DST) తెలంగాణ రాష్ట్ర విజ్ఞాన సాంకేతిక మండలి (TSCOST) మద్దతుతో, ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ సెల్ (IPR Cell), ప్రభుత్వ పాలిటెక్నిక్ ఆధ్వర్యంలో జరుగుతుందన్నారు.
ఈ వర్క్‌షాప్ ముఖ్యంగా విద్యార్థులు, అధ్యాపకులు, పరిశోధకులు, యువ ఆవిష్కారకులలో మేధస్సు సంపత్తి హక్కుల (IPR) పట్ల అవగాహన పెంపొందించడానికి ఏర్పాటు చేయబడిందన్నారు. పేటెంట్లు, ట్రేడ్‌మార్కులు, డిజైన్లు, కాపీరైట్లు, భౌగోళిక సూచికలు వంటి అంశాలపై నిపుణుల ద్వారా ఉపన్యాసాలు, అనుభవాల మార్పిడి జరుగుతుందన్నారు.ఈ కార్యశాలలో పరిశ్రమల నుండి వచ్చిన నిపుణులు, విద్యావేత్తలు పాల్గొంటారు.
పేటెంట్ దాఖలాకు సంబంధించి ప్రాక్టికల్ అవగాహనతో పాటు ఉచిత దాఖలాకు మార్గదర్శనం కూడా అందించబడుతుందన్నారు. బఅన్ని విభాగాల విద్యార్థులు, అధ్యాపకులు ఎలాంటి రిజిస్ట్రేషన్ ఫీజు చెల్లించకుండా పాల్గొనవచ్చాన్నారు. పాల్గొన్నవారికి E-Certificate అందించబడుతుందని తెలిపారు. https://forms.gle/TaJFCZ53mCfE5paA7 లింక్‌లో నమోదు చేసుకోవాల్నారు. అదనపు సమాచారం కోసం Email: gptciprcellwg@gmail.com లేదా 9491056452 / 9912422004 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు.