హనుమకొండ చౌరస్తా, జులై 10: నర్సంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల (అటానమస్) మే నెలలో నిర్వహించిన బీఏ, బీకాం, బీఎస్సీ (లైఫ్ సైన్సెస్), బీఎస్సీ (ఫిజికల్ సైన్సెస్) 2,4 సెమిస్టర్ పరీక్షల ఫలితాలు కాకతీయ యూనివర్సిటీ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ వల్లూరి రాంచంద్రం, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామ్స్ ప్రొఫెసర్ కట్ల రాజేందర్ విడుదల చేశారు. ఈ సందర్బంగా కళాశాల ప్రిన్సిపాల్ మల్లం నవీన్‌ని కళాశాల అటానమస్ సెమిస్టర్ పరీక్షలను సమర్థవంతంగా నిర్వహించినందుకు కాకతీయ విశ్వవిద్యాలయ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ కర్నాటి ప్రతాప్‌రెడ్డి అభినందించారు.
ఈ సందర్బంగా ప్రిన్సిపాల్ నవీన్ ఫలితాల వివరాలు వెల్లడించారు. బీఎస్సీలో 41.74 శాతం, బీఏలో 51.85 శాతం, బీకాంలో 39.02 శాతం, ఓవరాల్‌గా 42.62 శాతం ఉత్తీర్ణత సాధించారని తెలిపారు. ఈ ఫలితాలు క్యూఆర్ కోడ్ లింక్ ద్వారా అందుబాటులో కాలేజీ వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయని చెప్పారు. ఈ కార్యక్రమంలో పరీక్షల నియంత్రణ అధికారి ఎస్.కమలాకర్, అదనపు పరీక్షల నియంత్రణ అధికారి రాజీరు, భద్రు, స్టాఫ్ సెక్రటరీ రహీముద్దీన్ ఉన్నారు.