నర్సంపేట, సెప్టెంబర్ 6: సివిల్ సైప్లెలో అవకతవకలపై బీఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తుందని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వరంగల్ జిల్లా నర్సంపేటలో ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక తెలంగాణ సివిల్ సైప్లె కార్పొరేషన్లో భారీ స్కాం జరిగిందన్నారు. టెండర్ విలువ కంటే అదనంగా డబ్బులు వసూలు చేస్తున్నారని, తద్వారా ప్రభుత్వ ఖజానా ఖాళీ అవుతుందని హైకోర్టులో పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు.
దీనిపై శుక్రవారం వాదనలు విన్న హైకోర్టు చీఫ్ జస్టిస్ బాధ్యులకు నోటీసు లు జారీ చేయాలని, ప్రభుత్వం నాలుగు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని తెలిపిందన్నారు. ధాన్యం ఎత్తకుండానే మిల్లర్ల దగ్గర డబ్బులు వసూలు చేస్తూ అదనపు డబ్బులు బిడ్డర్ తీసుకొని టెండర్ డబ్బులు మాత్రమే సివిల్ సైప్లె కార్పొరేషన్‌కు చెల్లిస్తున్నారన్నారు. దీంతో ప్రభుత్వం నష్టపోతుందని, హమాలీ, ట్రాన్స్‌పోర్టు చార్జీలు సైతం ఏజెన్సీలకు మిగులుతున్నాయని చెప్పారు. బిడ్డర్ ప్రభుత్వానికి డబ్బులు చెల్లించకుండా పూర్తి చట్టవిరుద్ధంగా వ్యవహరిస్తున్నట్లు బీఆర్ఎస్ రాత పూర్వకంగా ఫిర్యాదు చేసినా ప్రభుత్వం పట్టించుకోలేద న్నారు.
ఈ వ్యవహారంలో పెద్దల హస్తం ఉందని నిబంధనలకు విరుద్ధంగా అక్రమాలకు పాల్పడుతున్నారని తెలిపారు. ఇటీవల సన్న బియ్యం టెండర్లలో నిర్ణయించిన ధర బేరీజు వేస్తే రూ.1100 కోట్ల నష్టం జరిగిందని, దీనికి ప్రభుత్వం భాద్యత వహించాలన్నారు. రైతులకు మద్దతు ధర చెల్లించే సివిల్ సైప్లె కార్పొరేషన్ నిర్వీర్యం కాకుండా ఉండాలంటే ఇలాంటి నస్టాలను, ఆక్రమాలను అరికట్టాలని, వసూలు చేసిన సొమ్మును కార్పొరేషన్‌కు వచ్చే విధంగా ఆదేశాలివ్వాలని తెలంగాణ రాష్ట్ర హైకోర్టును ఆశ్రయించినట్లు పెద్ది సుదర్శన్‌రెడ్డి వివరించారు.