అత్యాధునిక హంగులు.. కొంగొత్త ఫీచర్లు.. చూడగానే ఆకట్టుకునే రంగులు.. ఇంకా మరెన్నో ప్రత్యేకతలున్న కార్లు, బైక్‌లు వాహనప్రియులను ఎంతో ఆకట్టుకున్నాయి. నగరవాసుల సౌలభ్యం కోసం ‘నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే’ ఆధ్వర్యంలో అన్ని కంపెనీల వాహనాలను ఒక్కచోట చేర్చి నిర్వహించిన ఆటోషోకు విశేష స్పందన వచ్చింది. ఆయా కంపెనీల యాజమాన్యాలు స్పెషల్, ఎక్సేంజ్ ఆఫర్లు, భారీ డిస్కౌంట్లతో పాటు ప్రస్తుతం ఎంతో క్రేజ్ ఉన్న ఎలక్ట్రిక్ వాహనాలను పరిచయం చేయగా నగరవాసులు భారీ సంఖ్యలో తరలివచ్చి సందర్శించారు.
తమకు నచ్చిన కార్లు, బైక్‌లను గురిం చి తెలుసుకోవడంతో పాటు టెస్ట్ డ్రైవ్ చేసి, మరికొందరు అక్కడికక్కడే బుక్ చేసుకున్నారు. ఉదయం 10 గంటలకు మొదలై.. రాత్రివరకూ వచ్చివెళ్లే సందర్శకులతో హయగ్రీవాచారి మైదానంలో సందడి నెలకొంది. ఆటోషోకు వచ్చిన సందర్శకుల నుంచి లక్కీడీప్ ద్వారా బహుమతులు అందించగా రేపు(ఆదివారం) కూడా ఆటోషో కొనసాగనున్నది. త్వరపడండి.. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి.
హనుమకొండ చౌరస్తా, మార్చి 8 : నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఆటోషోకు విశేష స్పందన వచ్చింది. ఒకే వేదికపై సుమారు 20 ప్రముఖ కంపెనీల కార్లు, బైక్‌లు, ఎలక్ట్రిక్ బైక్‌లను ప్రదర్శించాయి. అన్ని వాహనాలను ఒకేచోట చూసుకునే వెసులుబాటును ఆటోషో ద్వారా కల్పించింది. రెండు రోజుల పాటు జరిగే ఆటోషోలో ఆటోమొబైల్ రంగంలోని ప్రముఖ కంపెనీలు పాల్గొన్నాయి. తమ కంపెనీల హైరేంజ్ కార్లు, బైక్‌లను, ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శించగా తమకు నచ్చిన కారు, బైక్‌ను సొంతం చేసుకోవాలనుకునేవారు ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన స్టాళ్లను సందర్శించి కంపెనీల ప్రతినిధుల ద్వారా అడిగి తెలుసుకున్నారు. కొందరు అక్కడికక్కడే బుక్ చేసుకున్నారు.
ఆటోషోను ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు ప్రారంభించారు. కార్యక్రమంలో నమస్తే తెలంగాణ బ్రాంచ్ మేనేజర్ పందిళ్ల అశోక్‌కుమార్, ఎడిషన్ ఇన్చార్జి కిరణ్‌కుమార్, బ్యూరో ఇన్చార్జి పిన్నింటి గోపాల్, మార్కెటింగ్ మేనేజర్ అప్పని సూరయ్య, సర్క్యూలేషన్ మేనేజర్ ఎడెల్లి సురేశ్‌రెడ్డి, బీఆర్ఎస్ నాయకుడు పులి రజినీకాంత్, మాజీ కార్పొరేటర్ జోరిక రమేశ్, రఘు, కరీంనగర్, వరంగల్ డీసీసీబీ డైరెక్టర్లు శ్రీపతి రవీందర్‌గౌడ్, చెట్టుపెల్లి మురళీధర్‌రావు, మాజీ జడ్పీటీసీ సారంగపాణి, నల్లబెల్లి సింగిల్‌విండో ఛైర్మన్, బీఆర్ఎస్ అధ్యక్షుడు బానోతు సారంగపాణి, ఎల్కతుర్తి సింగిల్‌విండో వైస్ చైర్మన్ మునిగడప శేషగిరి, ఎల్కతుర్తి మాజీ వైస్ ఎంపీపీ తంగెడ నగేశ్, సిబ్బంది పాల్గొన్నారు.
అత్యాధునిక టెక్నాలజీ. సరికొత్త ఫీచర్లతో పలు కంపెనీలు ప్రదర్శించిన ఎలక్ట్రిక్ బైక్‌లు ఆకట్టుకున్నాయి. ప్రస్తుత ఈవీ క్రేజ్ నడుస్తుండడంతో వినియోగదారులు వాటిపై ఆసక్తి చూపించారు. ఏటా ఈవీ వాహనాలు పెరుగుతుండటంతో, పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోల్చితే విద్యుత్ వాహనాల ధరలు, ఇంధన వ్యయం తక్కువగా ఉండటంతో ఆటోషోకు వచ్చిన సందర్శకులు ఎలక్ట్రిక్ వాహనాలను కొనేందుకు ఆసక్తి చూపారు.
అవును మీరు చదివింది నిజమే.. కేవలం లక్ష రూపాయలకే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లు వస్తున్నాయి. ప్రస్తుతం ఎలక్ట్రిక్ వాహనాల ట్రెండ్ నడుస్తోంది. పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రజలు చైతన్యంతో ఎలక్ట్రిక్ వాహనాలు కొనుగోలు చేస్తున్నారు. నగరంలోని యువత సైతం ఈవీ వాహనాలను కొనుగోలు చేసేందుకు క్రేజీ పెంచుకుంటున్నారు. ఇంటికి కనీసం రెండు విద్యుత్ వాహనాలు ఉండటంతో ఆయా కంపెనీలు సైతం ప్రత్యేకంగా ఆఫర్లతో ఆకట్టుకున్నారు. కేవలం లక్ష రూపాయలకే మూడు ఎలక్ట్రిక్ స్కూటర్లను ప్రదర్శనలో ఏర్పాటు చేశారు.
ఆటోషోలో ప్రముఖ కంపెనీల కార్లు, బైకులు రయ్.. రయ్‌మంటూ చక్కర్లు కొట్టాయి. వినియోగదారులు తమకు నచ్చిన వాహనాల్లో టెస్ట్ డ్రైవ్ చేశారు. స్టాళ్లను సందర్శించిన వినియోగదారులు ఎక్కువగా ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్లుగా చేతక్ వాహనాలపై ఆసక్తి చూపారు. నచ్చిన కార్ల గురించి తెలుసుకుని స్టీరింగ్ పట్టి గ్రౌండ్ ఆవరణలో డ్రైవ్ సరికొత్త అనుభూతి పొందారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి మూడు కార్లును, ద్విచక్ర వాహనాన్ని పరిశీలించడంతో పాటు సెల్ఫ్ డ్రైవ్ చేసి ఆకట్టుకున్నారు.
స్టాళ్ల సందర్శనకు వచ్చినవారిని ప్రోత్సహించేందుకు నమస్తే బంపర్ డ్రా ఏర్పాటు చేసింది. డ్రాలో విజేతలుగా నిలిచిన వారికి శనివారం బహుమతులు ప్రదానం చేశారు. వారికి వరంగల్ అనంతుల కేదారి ఫ్యామిలీ షాపింగ్‌మాల్ యజమాని అనంతుల వేణు బహుమతులు అందజేశారు.
వాహన ప్రేమికుల కోసం నమస్తేతెలంగాణ, తెలంగాణ టుడే హనుమకొండ నగరంలో ఆటో ఎక్స్పో నిర్వహించడం అభినందనీయం. హైదరాబాద్ తర్వాత పెద్దనగరమైన వరంగల్ అత్యంత చారిత్రత్మకమైంది. టూరిజంగా స్పాట్‌గా మారింది. ఇంకా చాలా అభివృద్ధి కావాల్సి ఉంది. అనేక పరిశ్రమలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. తెలంగాణ ఉద్యమంలో వరంగల్ ఎంతో కీలకమైంది. భారీ బహిరంగ సభలు ఇక్కడి నుంచే ప్రారంభించి గొప్ప స్ఫూర్తినిచ్చింది. తెలంగాణ ఉద్యమస్ఫూర్తి నుంచి వచ్చిన నమస్తేతెలంగాణ పత్రిక అందరినీ చైతన్యపరిచింది. తెలంగాణ వచ్చిన తర్వాత అంతుకుముందు ఎలా ఉందో ప్రజలందరికీ తెలుసు. రోడ్లు, డ్రైనేజీలు, పల్లెల్లో ఉచిత కరెంట్, సాగు, నీరు, నీళ్లు, పర్యావరణ పరిశుభ్రత, చెరువుల మరమ్మతు, వ్యవసాయరంగాన్ని అన్ని విధాలా అభివృద్ధి చేశారు.
వ్యాపారరంగాన్ని కూడా అభివృద్ధి చేయడం, మహబూబాబాద్ జిల్లా కూడా అన్ని రంగాల్లో ప్రగతి సాధించింది. ఒకప్పుడు సెకండ్ హ్యాండ్ కారు అమ్మితే క్యూ కట్టేవారు.. ఇప్పుడు కొత్తవాటికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారు. ఆటోషోలో అనేక దిగ్గజ కంపెనీలన్నింటినీ ఒకే వేదికపైకి తీసుకురావాలనే ఆలోచన గొప్పది. మారుతున్న కాలానికి అనుగుణంగా కంపెనీలు స్టాళ్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుత బిజీ లైఫ్‌లో ప్రతి ఒక్కరికీ వాహనం అవసరమైంది. వాహనాల కోసం షోరూంలు తిరగాల్సిన అవసరం లేకుండా వినియోగదారులు ఇక్కడికి వచ్చి నచ్చిన వాహనాలను కొనుగోలు చేయవచ్చు. టెస్ట్ డ్రైవ్ చేసి మరీ కొనుగోలు చేసేలా యాజమాన్యాలను, నిర్వాహకులను అవకాశం కల్పించడం అభినందనీయం. ప్రజలకు కొత్త టెక్నాలజీ, కొత్త విషయాలు తెలియజేసేందుకు అనేక కార్యక్రమాలు రావాలి.
– ఎమ్మెల్సీ తక్కళ్లపల్లి రవీందర్రావు
వాహన ప్రేమికుల అభిరుచులకు అనుగుణంగా నమస్తేతెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఆటోషో నిర్వహించడం అభినందనీయం. బైకులు, కార్లు కొనాలనుకునే వారికి అవసరాలను గుర్తించి ఒకే వేదికపైకి వివిధ కంపెనీలను తీసుకురావడం చాలా సంతోషంగా ఉంది. ఇలాంటి వేదికలు ప్రజలకు ప్రయోజనకరంగా ఉంటాయి. ఒకప్పుడు ఇలాంటి ఆటోషోలు మహానగరాలకే పరిమితయ్యేవి. ఇప్పుడు మన హనుమకొండలో అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామం. ఒకవైపు తెలంగాణ ప్రజల ప్రయోజనాలను కాపాడటంలో ముఖ్యభూమిక పోషిస్తున్న నమస్తే తెలంగాణ.. మరోవైపు ఆటోఎక్స్‌పో షో వంటి ప్రదర్శనలు నిర్వహించడం అభినందనీయం.
– జడ్పీ మాజీ చైర్మన్ మారపల్లి సుధీర్‌కుమార్
ప్రజల సౌకర్యార్థం అన్ని వాహనాలు ఒకే వేదికపై ఉండేలా నమస్తేతెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఆటోషో నిర్వహించడం అభినందనీయం. గతంలో ఇలాంటి షోలు ఢిల్లీ, హైదరాబాద్ వంటి మహానగరాల్లోనే ఉండేవి. ఇప్పుడు మన నగరాల్లో కూడా ఏర్పాటు చేస్తున్నారు. వాహనప్రియుల కలను సాకారం చేస్తున్నాయి. కొత్త ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలు చేశాను.
– కే నరేశ్, అడ్వకేట్స్‌కాలనీ
గ్రాండ్ విటారా హైబ్రిడ్, డ్యుయల్ పవర్, బ్యాటరీ అండ్ ఇంజిన్ పవర్, సెల్ఫ్ చార్జింగ్ వల్ల మైలేజీ 27.97 కి.మీ.లు వస్తుంది. 6 ఎయిర్‌బ్యాగ్స్, ఎల్ఈడీ హెడ్‌ల్యాంప్స్, 17 ఇంచెస్ అలైవీల్స్, 360 డిగ్రీ వ్యూస్ కెమెరా, పెద్దగా ఓపెన్ అయ్యే సన్‌రూఫ్ అత్యాధునిక హంగులతో అందుబాటులో ఉంది. గ్రాండ్ విటారా హైబ్రిడ్ ధర రూ.18.58 లక్షల నుంచి ప్రారంభం. నెక్సా కంపెనీ కార్లు అన్ని వర్గాలకు సుపరిచితమే. కస్టమర్ల అభిరుచికి అనుగుణంగా కంపెనీ కొత్త మోడల్ కార్లను అందుబాటులోకి తీసుకొస్తోంది.
– కల్వాల శశికిరణ్‌రెడ్డి, జీఎం, ఆదర్శ ఆటోవరల్డ్ నెక్సా షోరూం ములుగు రోడ్
కియా కార్లకు అనతికాలంలోనే అపూర్వ ఆదరణ పెరిగింది. ఒకే చోట అన్ని కంపెనీల వాహనాలను చేర్చడం మంచి ఆలోచన. ఇలాంటి వేదికలు మరిన్ని రావాలి. ఆటోషోకు నగరవాసుల స్పందన బాగుంది. మా స్టాల్స్‌ను సందర్శించి కారు ఫీచర్స్ అడిగి తెలుసుకున్నారు. కియా జీరోస్కార్ లేటెస్ట్ ఫీచర్స్‌తో అందుబాటులో ఉంది. డుయ్యల్ సన్‌రూఫ్, సెకండ్ రో సీట్ రీసైక్లింగ్, ైస్లెడింగ్ విత్ సీట్ వెంటిలేషన్, స్ట్రీమ్‌లైన్ డోర్ హ్యాండ్‌లెస్ బ్లెండ్ స్లీక్ డిజైన్ విత్ ఇన్నోవేటివ్ ఫంక్షనాలిటీ అనేక రకాల ఫీచర్స్‌తో ఉన్నాయి.
– పసుల ప్రసాద్, సేల్స్ మేనేజర్, మాలిక్ కియా, వరంగల్
హనుమకొండ టీవీఎస్ కంపెనీ, ఆదర్శ టీవీఎస్ ఆధ్వర్యంలో మార్కెట్లోకి సరికొత్త మోటార్ సైకిల్స్ అందుబాటులోకి వచ్చాయి. అపాచీ-160 2వీ (రూ.1,09,990), రైడర్-125 సీసీ (రూ.90,131), జుపిటర్-113సీసీ(రూ.78,091) స్కూటర్ న్యూ ఫీచర్స్‌తో మార్కెట్లోకి వచ్చాయి. నిట్ సమీపంలోని ఆరుష్ ఆటోమోటివ్స్ ఏథర్ టూ వీలర్ ఆధునిక టెక్నాలజీతో లభిస్తున్నాయి. ఇందులో అల్యూమిని యం ప్రాసెస్, లైవ్ గూ గుల్ మ్యాప్, పెద్ద సీటుగల, పవర్ ప్యాకింగ్ సేవింగ్స్, 8 ఏండ్ల వారంటీతో 70 శాతం హెల్త్ అస్యురెన్స్తో అందిస్తున్నాం.
– బూరుగు విజయ్‌గౌడ్, ఆదర్శ టీవీఎస్, సుబేదారి
ఒకే వేదికపైకి బైక్, కార్ల కంపెనీలను తీసుకురావడం అభినందనీయం. ఆటోషోలో మా కంపెనీ స్టాల్‌ను ఉమ్మడి జిల్లా నుంచి ఎంతోమంది సందర్శించారు. గ్రీన్‌హోండా వాహనాలకు ప్రస్తు తం మంచి క్రేజీ ఉంది. అమేజ్-3 టాప్మోడల్కు మంచి ఆదరణ ఉంది. ఆటోమెటిక్ బ్రేక్, లైట్స్, ఆటోహైబీమ్ వంటి ప్రత్యేకతలున్నాయి. రూ.7.15 లక్షల నుంచి లభిస్తున్నాయి.
– అల్లూరి పరమేశ్వర్, ఏజీఎం, గ్రీన్‌హోండా, ఆటోనగర్, వరంగల్
వాహనాల కొనుగోలు చేసేందుకు వినియో గదారులకు ఇది మంచి ప్లాట్‌ఫాం. ఆటోషో ఏర్పాటుచేసిన నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడేకు అభినందనలు. తక్కువ డౌన్‌పేమెంట్, మంచి డిస్కౌంట్, బ్యాంకు లోన్, జీరో పర్సం ట్ డౌన్ పేమెంట్ కల్పిస్తుంది. ఆదర్శ మారుతీ సుజుకి డ్రైవింగ్ స్కూ ల్ ద్వారా శిక్షణ కూడా ఇస్తున్నాం. మొదటిరోజే చాలామంది సం దర్శకులు మా స్టాల్‌ను సందర్శించి కార్ల గురించి వివరాలు తెలుసు కున్నారు. ప్రజల నుంచి మంచి ఆదరణ వస్తోంది. ప్రస్తుతం బ్రీజా 5 స్టార్స్ విత్ సిక్స్ ఎయిర్‌బ్యాగ్స్ మోడల్‌కు మంచి క్రేజ్ ఉంది.
– కేఎస్ కల్యాణ్, జనరల్ మేనేజర్, ఆదర్శ ఆటోమోటివ్స్, ములుగురోడ్
ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువతను ఆక ట్టుకునేలా అధునాతన వాహనాలు అందుబా టులోకి వచ్చాయి. వినియోగదా రులు సైతం పాత కార్లు అమ్మేసి కొత్తవి కొనేందుకే ఆసక్తి చూపుతున్నారు. నమస్తే తెలంగాణ, తెలంగాణ టుడే ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ ఆటోషోలో మా స్టాల్ ఏర్పాటు చేశారు. ప్రజలు ఆసక్తిగా వచ్చి ప్రదర్శనను తిలకించారు. పాత కారు ఏదైనా సరే ఎక్సేంజ్ చేసి కొత్త కారు కొంటే బెస్ట్ ప్రైజ్‌లో అందిస్తున్నాం. భారీ డిస్కౌంట్లు కూడా ఉన్నాయి.
– నితిన్, జనరల్ మేనేజర్, విన్ మోటార్స్ టీవీఎస్, ములుగు రోడ్, వరంగల్
గ్రామీణ ప్రగతే లక్ష్యంగా డీసీసీబీ ముందుకెళ్తున్నది. వ్యవసాయ భూములు, గృహాలపై వాహన రుణ సదుపాయం ఇస్తున్న ఏకైక బ్యాంకు. బంగారు ఆభరణాల తాకట్టుపై అత్యధికంగా గ్రాముకు రూ.5,500 అతి తక్కువ వడ్డీ రేటుకు 88పైసల నెలసరి వడ్డీతో ఇస్తున్నాం. గ్రామాల్లో వ్యవసాయ భూముల తాకట్టుపై గృహరుణాలు ఇస్తున్న ఏకైక బ్యాంకు డీసీసీబీ. నమస్తే తెలంగాణ-తెలంగాణటుడే ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఆటోషో మంచి వేదిక. ఇలాంటి కార్యక్రమాలు ఏర్పాటు చేసి ప్రజలకు మరింత చేరువ కావాలి.
– డీసీసీబీ చైర్మన్ మార్నేని రవీందర్రావు
మారుతీ సుజుకి బ్రీజాకు మంచి స్పందన ఉంది. మైలేజీ, దృఢత్వంతో పాటు వినియోగ దారుల భద్రతకు ఎక్కువ ప్రాధాన్యమిస్తూ అన్ని వాహనాల్లో ఆరు ఎయిర్‌బ్యాగులు అందిస్తున్నాం. అన్ని మోడల్స్‌పై సుమారు 20 నుంచి 80వేల వరకు డిస్కౌంట్ ఉంది. ఎలాంటి వెయిటింగ్ లేకుండా వెంటనే ఇస్తున్నాం. 100కు పైగా వినియోగదారులు మా వాహనాల గురించి తెలుసుకున్నారు. పది మంది కొనుగోలు చేసే అవకాశాలు ఉన్నాయి.
– కె.విజేందర్, జనరల్ మేనేజర్, విన్ మోటార్స్
మార్కెట్లోకి ఇప్పుడు నూతన కార్లు వస్తున్నా యి. సిట్రోన్ కార్లకు మంచి గిరాకీ ఉంది. ఫ్రెంచ్ కంపెనీ మేడిన్ ఇండియా. రూ.6.16 ల క్షల నుంచి అందుబాటులో ఉన్నాయి. ఫ్లయిం గ్ సస్పెన్షన్ సౌకర్యం ఉంది. కారులో ఎంత మంది కూర్చున్నా ఇబ్బంది ఉండదు. స్పేస్ కంఫర్ట్ బాగుంటుంది. ఇది ఏ కంపెనీలో మార్కెట్లో లభించడం లేదు. సిట్రోన్ కారులో సౌకర్యవంతంగా ప్రయాణించవచ్చు. నమస్తే తెలంగాణ-తెలంగాణ టుడే ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఆటోషోలో మంచి స్పందన వచ్చింది.
– మహ్మద్ హర్షద్, ప్రైడ్ సిట్రోన్, హంటర్‌రోడ్
ప్రస్తుత మార్కెట్లో యమహా వాహనాలకు మంచి క్రేజీ ఉంది. యువత ఎక్కువగా కొనుగోలు చేస్తున్నారు. యమహా నుంచి ఆటోషోలో ఫసీనో, ఏరోక్స్, రేజెడ్ఆర్, స్కూటర్స్, ఎఫ్జెడ్స్ బైక్‌లను ప్రదర్శనకు మంచి స్పందన వచ్చింది. చాలామంది వచ్చి యమహా ద్విచక్ర వాహనాలను చూసి వివరాలను తెలుసుకుని టెస్ట్రైడ్ చేశారు. మా స్టాల్‌ను సందర్శించి మా ద్విచక్ర వాహనాలను కొనుగోలు చేయడం సంతోషంగా ఉంది. కస్టమర్లు బుకింగ్ కూడా చేసుకున్నారు.
– ఎన్ రామకృష్ణ, యమహా సేల్స్ మేనేజర్, ములుగు రోడ్
ఆటోషోలో మా స్టాల్‌ను అనేకమంది యువకులు సందర్శించారు. చేతక్ ఓల్డ్ ఇజ్ గోల్డ్. మార్కెట్లో ఎంతో క్రేజ్ ఉన్నందున చాలామంది టెస్ట్ రైడ్ చేశారు. చేతక్ 3501, 3502 మోడళ్లు, అన్ని రంగుల్లో అందుబాటు లో ఉన్నాయి. బ్యాంక్ లోన్, ఎక్సేంజ్ ఆఫర్, పీఎంఈ డ్రైవ్ సబ్సిడీ కింద రూ.10 వేలు ఉంది. ఈ నెల 31 వరకు అవకాశం ఉంది.
– ముప్పసాని నాగార్జున, జనరల్ మేనేజర్, చేతక్, హంటర్‌రోడ్, న్యూశాయంపేట