హనుమకొండ చౌరస్తా, మార్చి 17: నమస్తే తెలంగాణ సీనియర్ ఫొటో జర్నలిస్టు గొట్టె వెంకన్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్‌వర్మ చేతులమీదుగా రాష్ట్రస్థాయి అవార్డు అందుకున్నారు. సోమవారం హైదరాబాద్ బషీర్‌బాగ్‌లోని సురవరం ప్రతాప్‌రెడ్డి ఆడిటోరియంలో తెలంగాణ రాష్ట్ర వరింగ్ జర్నలిస్టుల సంఘం(టీయూడబ్ల్యూజే) అనుబంధ తెలంగాణ స్టేట్ ఫోటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ నిర్వహించిన ఉత్తమ ఫొటో జర్నలిస్టులకు అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమంలో గవర్నర్ ఈ అవార్డు ప్రదానం చేశారు.
కార్యక్రమంలో ఐజేయు స్టీరింగ్ కమిటీ సభ్యులు దేవులపల్లి అమర్, రాష్ట్ర టూరిజం అభివృద్ధి సంస్థ చైర్మన్ పటేల్ రమేశ్‌రెడ్డి, టీయూడబ్ల్యుజే రాష్ట్ర అధ్యక్షుడు కె.విరాహత్ అలీ, ప్రధాన కార్యదర్శి కె.రాంనారాయణ, ఫొటో జర్నలిస్ట్స్ అసోసియేషన్ అధ్యక్షులు, ప్రధాన కార్యదర్శి గంగాధర్, కె.ఎన్.హరి పాల్గొన్నారు.