బచ్చన్నపేట ఏప్రిల్ 7 : రైతుల పండించిన ధాన్యం గిట్టుబాటు ధర కల్పించేందుకు గాను ప్రభుత్వం గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తుందని, వాటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని చేర్యాల మార్కెట్ కమిటీ చైర్పర్సన్ నల్లనాగుల శ్వేత సూచించారు. సోమవారం మండలంలోని పోచన్నపేట, నాగిరెడ్డిపల్లి, తమ్మడపల్లి గ్రామాల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పండించిన వరికి గిట్టుబాటు ధర కల్పించేందుకే గ్రామ గ్రామాన కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. రైతులు దళారులను ఆశ్రయించకుండా నేరుగా ధాన్యాన్ని కేంద్రాలకే తరలించాలన్నారు.
కేంద్రాల్లో రైతులకు అవసరమయ్యే గన్ని బ్యాగులు సిద్ధంగా ఉంచాలని అధికారులను ఆదేశించారు. అదేవిధంగా కొనుగోలు చేసిన ధాన్యాన్ని వెంట వెంటనే తరలించాలని సూచించారు. ధాన్యంకు సంబంధించి డబ్బులు సైతం రైతుల ఖాతాలలో సత్వరమే పడే విధంగా అధికారులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షుడు నూకల బాల్ రెడ్డి, సీసీలు నరసింహులు, తిరుమలమ్మ, వివోఏ లలిత, కొడవలూరు దేవస్థానం చైర్మన్ మల్లారెడ్డి, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులు వెంకటాచారి, ఎద్దు హరీష్, కరుణాకర్ రెడ్డి, రాములు, రవీందర్ రెడ్డి, బాలరాజు, సిద్ధారెడ్డి, ఫిరోజ్, బుచ్చి రాములు, మల్లేశం, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.