ఏటూరునాగారం : చదివించేందుకు తల్లిదండ్రులు లేరు. కానీ, చదవాలి ఏదో చేయాలనే తపన మనసును కలిచివేసింది. ప్రయత్నం అంటూ ఏదైనా చేస్తే సాధించలేనిది ఏది లేదని నిరూపించాడు ఏటూరు నాగారం మండలం మానసపలికి చెందిన దైనంపల్లి ప్రవీణ్ కుమార్. అత్యంత నిరుపేద కుటుంబానికి ప్రవీణ్ కుమార్ తండ్రి చిన్నతనంలోనే చనిపోయాడు. తల్లి పదవ తరగతి వరకు చదివించి ఆమె కూడా చనిపోయింది. ప్రవీణ్ కుమార్ కు ఒక తమ్ముడు, చెల్లెలు ఉన్నారు. ఈ కుటుంబానికి నానమ్మలు అండగా నిలబడ్డారు. గ్రామపంచాయతీ, బస్టాండ్ లలో సఫాయి సిబ్బందికి పనిచేసే నానమ్మలు తోడుగా నిలిచారు.
సంపాదించిన దానిలో ఎంతో కొంత చదువుల కోసం కేటాయించారు. అలాగే కొంతమంది గురువులు అందించిన ఆర్థిక సాయం మనోధైర్యంతో ముందుకు సాగి జాకారం సాంఘిక సంక్షేమ శాఖ గురుకులంలో ఇంటర్ చేసి ఉస్మానియా యూనివర్సిటీలో బీటెక్ పూర్తి చేశాడు. ఎస్ ఆర్ శంకరన్ ఏర్పాటుచేసిన స్టడీ సర్కిల్లో గ్రూప్స్ కు ప్రిపేర్ అయ్యారు. పట్టుదలతో తన ప్రతిభను చాటి రెండుసార్లు సివిల్స్ రాశాడు. 8 10 మార్కులతో సాధించలేక పోయినప్పటికీ పట్టుదలతోనే ముందుకు సాగారు. గత ఏడాది జరిగిన గ్రూప్ వన్ పరీక్షల్లో పాల్గొన్నారు.
ర్యాంకులను ఆదివారం ప్రకటించడంతో అందులో ప్రవీణ్ కుమార్ 105 ట్యాంక్ సాధించాడు. ఈ ర్యాంకు రావడం తనకు ఎంతో ఆనందంగా ఉందని డిఎస్పి పోస్ట్ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలిపారు. ఎస్సార్ శంకర్ స్ఫూర్తితో ముందుకు సాగానని ప్రాథమిక విద్యలో స్థానికంగా ఉన్న ఉపాధ్యాయుడు మల్లయ్య ఎంతో సహకరించి జీవిత పాఠాలులు కూడా నేర్పాడని ప్రవీణ్ కుమార్ తెలిపారు. తాను కష్టపడిన తీరును ఓసారి నెమరు వేసుకొని తన లాంటి పేద కుటుంబాలు విద్యార్థులకు సేవలు అందించి తోడ్పడుతానని ప్రవీణ్ కుమార్ పేర్కొన్నారు.