Anti Tobacco Day | ములుగు రూరల్: ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకుని ములుగు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో జిల్లా కోర్టు ఆవరణలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమనికి ముఖ్య అతిథిగా ప్రిన్సిపాల్ జూనియర్ సివిల్ జడ్జి గుంటి జ్యోత్స్న పాల్గొన్నారు.
ఈ సందర్భంగా గుంటి జ్యోత్స్న మాట్లాడుతూ.. పొగాకు సేవించడం ఆరోగ్యానికి హానికరమని తెలిపారు. ధూమపానం చేయనివారు సెకండ్ హ్యాండ్ స్మోక్ కూడా పొగ పీల్చడం వల్ల వారి ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందని పేర్కొన్నారు. సిగరెట్లు, హుక్కా, ఎలక్ట్రానిక్ సిగరెట్లు, పొగాకు నమలడం ద్వారా ఆరోగ్యం దెబ్బతింటుందని చెప్పారు. ఈ సందర్భంగా న్యాయవాదులు, కోర్టు సిబ్బంది, పోలీసులు, కక్షిదారులతో పొగాకు రహిత ప్రతిజ్ఞ చేయించారు.