పార్టీ అభివృద్ధికి కృషి చేసే కార్యకర్తలకు తగిన ప్రాధాన్యం
అన్ని వర్గాల అభ్యున్నతే టీఆర్ఎస్ ప్రభుత్వ ధ్యేయం
రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్
పార్టీ పటిష్టత కోసమే సంస్థాగత నిర్మాణం
టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమల్లు
ములుగు, సెప్టెంబర్ 6(నమస్తేతెలంగాణ);‘టీఆర్ఎస్ బలోపేతం కోసం కార్యకర్తలు, నేతలు సమన్వయంతో పని చేయాలి. ఇచ్చిన మాట ప్రకారం సీఎం కేసీఆర్ ములుగును జిల్లాగా ఏర్పాటు చేశారు. గిరిజనులకు అభివృద్ధి ఫలాలు అందాలని ప్రభుత్వం ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేపట్టింది. గోదావరి కరకట్టల నిర్మాణానికి రూ.137 కోట్లు మంజూరు చేసింది. ములుగు నియోజకవర్గ ఎమ్మెల్యేతో ఒరిగేదేమీ లేదు’ అని రాష్ట్ర గిరిజన, స్త్రీశిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ అన్నారు. టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం, పార్టీని పటిష్టం చేయడంలో భాగంగా సోమవారం తాడ్వాయి మండలకేంద్రంలో ములుగు జిల్లా టీఆర్ఎస్ నాయకులతో సమావేశం నిర్వహించారు. జడ్పీచైర్మన్, ములుగు నియోజకవర్గ ఇన్చార్జి కుసుమ జగదీశ్వర్ అధ్యక్షతన నిర్వహించిన సమావేశానికి మంత్రితో పాటు మానుకోట ఎంపీ మాలోతు కవిత, టీఎస్ఐఐసీ చైర్మన్, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్యాదరి బాలమల్లు హాజరయ్యారు.
టీఆర్ఎస్ పార్టీని మరింత బలోపేతం చేసేందుకు జిల్లాలోని అన్ని వర్గాల నాయకులు సమన్వయంతో పనిచేయాలని రాష్ట్ర గిరిజన, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి సత్యవతిరాథోడ్ సూ చించారు. టీఆర్ఎస్ సంస్థాగత నిర్మాణం, పార్టీని పటిష్టం చేయడంలో భాగంగా తాడ్వాయి మండల కేంద్రంలో ము లుగు జిల్లా నాయకులతో జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అధ్యక్షతన సోమవారం సమీక్ష నిర్వహించగా, మానుకోట ఎంపీ మాలోతు కవిత, టీఎస్ఐఐసీ చైర్మన్ గ్యాదరి బాలమ ల్లుతో కలిసి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మా ట్లాడుతూ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా సీఎం కేసీఆర్ ఇచ్చిన మాట తప్పకుండా ములుగు ప్రాంతాన్ని జిల్లాగా ఏర్పాటు చేశారని అన్నారు. కేసీఆర్‌పై నమ్మకంతో పార్ల మెంట్ ఎన్నికలో ఎంపీ కవితను భారీ మెజార్టీతో గెలిపించి నట్లు తెలిపారు.తెలంగాణ అభివృద్ధి ఫలాలు గిరిజనులకు అందాలని ఈ ప్రాంతంలో అనేక కార్యక్రమాలు చేపట్టా మని పేర్కొన్నారు. గోదావరి కరకట్టల నిర్మాణానికి రూ. 137 కోట్లు మంజూరు చేసినట్లు తెలిపారు. పార్టీ ఏర్పడి 20 ఏళ్లు అయిన సందర్భంగా ఢిల్లీలో పార్టీ కార్యాలయాని కి శంకుస్థాపన చేసినట్లు చెప్పారు. టీఆర్ఎస్ కంటే ముందు నుంచీ అనేక ఏళ్లుగా పనిచేస్తున్న పార్టీలకు ఢిల్లీలో పార్టీ భవ నాలు లేవని, అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో మూడు వంతుల సీట్లు సాధించిన పార్టీలకే అక్కడ స్థలాన్ని కేటాయి స్తారని తెలిపారు.
ఎమ్మెల్యేలకు గతంలో ఏ పార్టీ కూడా క్యాంపు ఆఫీసులు కట్టాలని ఆలోచించలేదని, ఇక్కడి కాంగ్రెస్ ఎమ్మెల్యే టీఆర్ఎస్ ప్రభుత్వం కట్టించిన కార్యాల యంలోనే ఉంటూ ప్రభుత్వంపై అవాకులు, చవాకులు మా ట్లాడుతుందని అన్నారు. నియోజకవర్గానికి ఎమ్మెల్యే వల్ల ఒరిగిందేమిటో చెప్పాలని అన్నారు. బీజేపీ నాయకత్వంలో దేశంలో పెట్రోల్, డీజిల్, గ్యాస్ రేట్లు పాపం పెరిగినట్లు పెరుగుతున్నాయని అన్నారు. రైల్వే స్టేషన్లో టీ అమ్మిన ప్ర ధాని మోదీ, రైల్వే స్టేషన్లను అమ్మేందుకు ప్రయత్నిస్తున్నా రని విమర్శించారు. టీఆర్ఎస్ పార్టీకి పటిష్టమైన నాయక త్వం ఉందని, సమర్థులకు గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థా యి వరకు తగిన న్యాయం జరిగేలా బాధ్యత తీసుకుంటా మని తెలిపారు. సమావేశంలో జడ్పీ వైస్ చైర్మన్ బడే నాగ జ్యోతి, మాజీ ఎంపీ ప్రొఫెసర్ అజ్మీరా సీతారాంనాయక్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ అజ్మీరా ప్రహ్లాద్, ఎంపీపీలు గండ్రకోట శ్రీదేవి, వాణిశ్రీ, సూడి శ్రీనివాస్‌రెడ్డి, విజయ, రజిత, జడ్పీటీసీలు సకినాల భవాని, తుమ్మల హరిబాబు, గై రుద్రమదేవి, టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు గుండాల మదన్‌కుమార్, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, పార్టీ నాయకుడు పోరిక గోవింద్‌నాయక్, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, మండల, గ్రామ పార్టీల అధ్యక్షు లు, రైతుబంధు సమితి నాయకులు పాల్గొన్నారు.
పార్టీ పటిష్టత కోసమే..