వాడవాడలా రెపరెపలాడిన గులాబీ పతాక
ఢిల్లీలో ఆత్మగౌరవ ప్రతీకకు భూమిపూజ.. ఊరూరా ఆనంద హేల
అంబరాన్నంటిన టీఆర్ఎస్ జెండా పండుగ
జెండాను ఎగరేసిన పార్టీ ముఖ్యులు
ఉత్సాహంగా పాల్గొన్న కార్యకర్తలు
జయశంకర్ భూపాలపల్లి/ ములుగు, సెప్టెంబర్ 2 ( నమస్తే తెలంగాణ), ఏటూరునాగారం : తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఆవిర్భవించిన టీఆర్ఎస్ రాజకీయ పార్టీగా అవతరించి 20 వసంతాలు పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా ఆ పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు టీఆర్ఎస్ శ్రేణు లు జెండా పండుగను ఘనంగా నిర్వహించాయి. జయశంకర్ భూపాలపల్లి, ములుగు జిల్లాల్లోని ప్రతి గ్రామం లో టీఆర్ఎస్ జెండాలను ఆవిష్కరించారు. రాష్ట్ర సాధ న కోసం ప్రాణ త్యాగాలు చేసిన అమరవీరులకు నివాళులర్పించారు. అనంతరం స్వీట్లు పంపిణీ చేశారు.
పండుగ వాతావరణంలో జెండా పండుగ
టీఆర్ఎస్ జెండా పండుగను పార్టీ శ్రేణులు పండుగ వాతావరణంలో జరుపుకున్నాయి. రాష్ట్ర సాధన కోసం పోరాడిన గులాబీ జెండాను ప్రజలు తమ మదిలో పెట్టుకుంటున్నారని పలువురు నాయకులు తమ ప్రసంగాల్లో వెల్లడించారు. గ్రామ, మండల, జిల్లా, పట్టణ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు పాల్గొని జై తెలంగాణ, జై కేసీఆర్, జైజై కేసీఆర్, కేటీఆర్ నాయకత్వం వర్ధిలాల్లి వంటి నినాదాలు చేశారు. అనంతరం నాయకులు స్వీట్లు పంపిణీ చేసి, పటాకులు కాల్చి సంబురాలు జరుపుకున్నారు. గులాబీ తోరణాలతో గ్రామాలు గులాబీమయమయ్యాయి.
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శం
-ములుగు జడ్పీ చైర్మన్ జగదీశ్వర్
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శంగా నిలుస్తున్నాయని ములుగు జడ్పీ చైర్మన్ కుసుమ జగదీశ్వర్ అన్నారు. ములుగు జిల్లా కేంద్రం, ఏటూరునాగారం మండల కేంద్రంలో గురువారం నిర్వహించిన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ములుగు, ఏటూరునాగారం మండలాల అధ్యక్షులు బాదం ప్రవీణ్, గడదాసు సునీల్‌కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు చేయగా, జడ్పీ చైర్మన్ టీఆర్ఎస్ జెండాను ఆవిష్కరించారు. ఏటూరునాగారంలో తెలంగాణ తల్లి విగ్రహానికి పూలమాల వేసి నివాళలర్పించారు. వేర్వేరుగా జరిగిన కార్యక్రమాల్లో జడ్పీ చైర్మన్ మాట్లాడారు. నాయకులు, కార్యకర్తలు ప్రజలకు వారధిగా ఉండాలని సూచించారు. ప్రజల ఆత్మ గౌరవం టీఆర్ఎస్ పార్టీ అని అన్నారు. సంస్థాగత నిర్మాణానికి నేటితో మండలాల్లో శ్రీకారం చుట్టినట్లు తెలిపారు. ములుగు నియోజకవర్గంలో ఎలాంటి వర్గాలకు తావు లేదని, అందరు సీఎం కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వర్గమేనని అన్నారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలను గుర్తించి పార్టీ కమిటీల్లో సముచిత స్థానం కల్పించనున్నట్లు తెలిపారు. అదేవిధంగా జిల్లా కేంద్రంలోని గాంధీ విగ్రహం వద్ద, గొల్లవాడలో టీఆర్ఎస్ నాయకులు జెండాను ఆవిష్కరించారు.
భూపాలపల్లిలో జెండాను ఆవిష్కరించిన మున్సిపల్ చైర్పర్సన్ వెంకటరాణి
జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని 1వ వార్డులో టీఆర్ఎస్ జెండా పండుగను ఘనంగా నిర్వహించారు. మున్సిపల్ చైర్ పర్సన్ సెగ్గం వెంకటరాణీ సిద్ధు పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టీఆర్ఎస్ ప్రజల పార్టీగా వారి గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోతుందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ తెలంగాణను దేశంలోనే ఆదర్శ రాష్ట్రంగా తీర్చి దిద్దుతున్నారని తెలిపారు. కార్యక్రమాల్లో ములుగు జడ్పీటీసీ సకినాల భవాని, ఎంపీటీసీ శ్రీదేవి, రైతుబంధు సమితి జిల్లా అధ్యక్షుడు పల్లా బుచ్చయ్య, మండల కోఆర్డినేటర్ కేశెట్టి కుటుంబరావు, కో ఆప్షన్ సభ్యుడు రియాజ్మిర్జా, ఎంపీటీసీల ఫోరం జిల్లా అధ్యక్షుడు పోరిక విజయ్‌రాంనాయక్, ఎంపీటీసీలు గొర్రె సమ్మయ్య, మాచర్ల ప్రభాకర్, నాయకులు రమేశ్‌రెడ్డి, తాహెర్పాషా, సత్యనారాయణరావు, శ్రీనివాస్‌రెడ్డి, మల్క రమేశ్, వేల్పూరి సత్యనారాయణరావు, పట్టణ అధ్యక్షుడు మేర్గు సంతోష్‌యాదవ్, గోవింద్‌నాయక్, గట్టు మహేందర్, గజ్జి నగేశ్, చిన్న, రవియాదవ్, మంద రవి పాల్గొన్నారు. ఏటూరునాగారంలో జరిగిన కార్యక్రమంలో ఎంపీపీ అంతటి విజయ, జడ్పీ కోఆప్షన్ సభ్యురాలు వలియాబీ, వైస్ ఎంపీపీ తుమ్మ సంజీవరెడ్డి, ఎంపీటీసీలు కోట నర్సింహులు, పర్వతాల భరత్, అల్లి సుమలత, కుమ్మరి స్వప్న, పీఏసీఎస్ చైర్మన్ కూనూరు అశోక్, నాయకులు నూతి కృష్ణమూర్తి, తుమ్మ మల్లారెడ్డి, తాడూరి రఘు, మెరుగు వెంకటేశ్వర్లు, పెండ్యాల ప్రభాకర్, సర్దార్‌పాషా, జాడి భోజారావు, కిరణ్‌కుమార్, ఖాజా పాషా, చంద్రబాబు, రాంనర్సయ్య, ఖలీల్, కనకతార తదితరులు పాల్గొన్నారు.